Viral Video: ప్రాణాల కోసం పక్షి పొరాటం.. ఆహారం కోసం తలపెడితే అసలుకే ఎసరొచ్చింది.. వీడియో చూస్తే మనస్సు చలించకమానదు..
ఆకలి ఎవరికైనా ఒకటే. సమస్త ప్రపంచం పొరాడేది జానెడు పొట్టకోసమే. ధనిక.. పేదవారైనా... నిత్యం జీవనపోరాటం చేసేది కడపు నింపుకోవడానికే. అయితే కేవలం మనషులు
ఆకలి ఎవరికైనా ఒకటే. సమస్త ప్రపంచం పొరాడేది జానెడు పొట్టకోసమే. ధనిక.. పేదవారైనా… నిత్యం జీవనపోరాటం చేసేది కడపు నింపుకోవడానికే. అయితే కేవలం మనషులు మాత్రమే కాదు.. ఈ భూమండలంపై ఉన్న సమస్త జీవరాశి.. ఆహారం కోసం ప్రయాత్నాలు చేస్తూనే ఉంటాయి. కానీ మానవుడు సృష్టించిన ప్లాస్టిక్ భూతం జీవరాశుల పట్ల యమపాశంగా మారింది. నేడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో ప్లాస్టిక్ భూతం అగ్రస్థానంలో ఉంది. మనిషి తన సౌకర్యం కోసం తయారు చేసుకున్న ఈ పదార్థం అతనికే కాకుండా ప్రాణికోటికే ముప్పుగా పరిణమించింది. ఇటీవలి కాలంలో కడలి ఒడ్డుకు కొట్టుకొచ్చిన తిమింగలం పొట్టలో దొరికిన కిలోల కొద్దీ ప్లాస్టిక్ వస్తువులు మనిషి నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేశాయి. కానీ పక్షులు, జంతువులు ప్లాస్టి్క్ మాహామ్మరి కారణంగా అంతరించిపోతున్నాయి. అయితే తాజాగా అటవీ ప్రాంతంలోని ఓ గోరింక..ప్లాస్టిక్ కవర్‌లో ఇరుక్కుపోయిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రతిరోజూ అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. కానీ కొన్ని సార్లు ప్రత్యేక కారణం కోసం అనేక వీడియోలు చర్చలోకి వస్తాయి. తాజాగా ఓ మైనా పక్షి వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. అఫ్రోజ్ షా అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేయగా, నెటింట చర్చనీయాంశంగా మారింది. ఆ వీడియోలో గోరింక తన తల ప్లాస్టిక్ ప్యాకెట్‌లో ఇరుక్కుపోవడంతో ప్రాణ రక్షణ కోసం పోరాడుతోంది. ఆకలితో ఆహారం కోసం తల పెట్టిన ఆ గోరింకకు అనుకొని షాక్ తగిలింది. తల ఆ ప్లాస్టిక్ కవర్లో ఇరుక్కు పోవడంతో ప్రాణం కోసం కొట్టుమిట్టాడుతుంది కనిపించింది. 19 సెకన్ల ఈ వీడియోను ప్రతి ఒక్కరినీ కదిలించింది. వీడియో చూసిన నెటిజన్లు..మనుషులు చేస్తున్న తప్పులకు మూగజీవాలు, పక్షులు ఇలా చిక్కుల్లో పడాల్సి వస్తోందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ట్వీట్..
A Myna bird – in a forest- trapped in a snacks packet – single use multi layer packaging (MLP ).
Produce, Buy , Eat and litter .
Our volunteer freed it in the SGNP forest.
And then these hapless species fight to live on.@RandeepHooda @UNEP @PoojaB1972 pic.twitter.com/WPXl6kupIE
— Afroz shah (@AfrozShah1) August 19, 2021