Telangana Corona: తెలంగాణలో తగ్గుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు.. ఏ జిల్లాలో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..

TS Corona Upd: దేశంలో ఏడాదికిపైగా అతలాకుతలం చేసిన కరోనా ప్రస్తుతం తగ్గుముఖం పడుతోంది. ఇక తెలంగాణలో కరోనా కట్టడికి అనేక..

Telangana Corona: తెలంగాణలో తగ్గుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు.. ఏ జిల్లాలో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..
Ts Corona Update
Follow us
Subhash Goud

|

Updated on: Aug 24, 2021 | 7:57 PM

TS Corona Upd: దేశంలో ఏడాదికిపైగా అతలాకుతలం చేసిన కరోనా ప్రస్తుతం తగ్గుముఖం పడుతోంది. ఇక తెలంగాణలో కరోనా కట్టడికి అనేక చర్యలు చేపట్టింది ప్రభుత్వం. దీని కారణంగా ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గుతున్నాయి. ఇక తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 389 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు. మంగళవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,55,732 నమోదు కాగా, 3,862 మంది మరణించారు. ఇక తాజాగా కోలుకున్న వారి సంఖ్య 420 ఉండగా, ఇప్పటి వరకు కోలుకున్న వారు 6,45,594కు చేరింది. అలాగే రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతం ఉండగదా, దేశంలో 1.3 శాతం ఉంది. ఇక రాష్ట్రంలో కోలుకున్న వారి రేటు 98.45 శాతం ఉండగా, దేశంలో 97.65 శాతం ఉంది. రాష్ట్రంలో మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 6,276కు చేరింది. నమోదయ్యాయి.

ఇక గడిచిన 24 గంటల్లో జిల్లాల వారీగా నమోదైన పాజిటివ్‌ కేసులు ఇలా ఉన్నాయి..

ఆదిలాబాద్‌లో 6 కరోనా బారిన పడగా, భద్రాది కొత్తగూడెంలో 12 మంది, జీహెచ్‌ఎంసీలో 70, జగిత్యాలలో 19, జగామలో 6, జయశంకర్‌ భూపాలపల్లిలో 4, జోగులాంబ గద్వాలలో 4, కామారెడ్డి -2, కరీంనగర్‌ -36, ఖమ్మం-20, కొమురంభీం ఆసిఫాబాద్‌-2, మహబూబ్‌నగర్‌-3, మహబూబాబాద్‌ -8, మంచిర్యాల -10, మెదక్‌ -2, మేడ్చల్‌ మల్కాజిగిరి-27, ములుగు -4, నాగర్‌ కర్నూలు-2, నల్గొండ-28, నారాయణపేట-1, నిర్మల్‌ (ఎలాంటి కేసులు నమోదు కాలేదు), నిజామాబాద్‌-3, పెద్దపల్లి-18, రాజన్న సిరిసిల్ల-12, రంగారెడ్డి-24, సంగారడ్డి-3, సిద్దిపేట-7, సూర్యాపేట-12, వికారాబాద్‌-1, వనపర్తి-5, వరంగల్‌ రూరల్‌-7, వరంగల్‌ అర్బన్‌-22, యాదాద్రి భువనగిరి జిల్లాలో-9 చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

Ts