Dasara Movie: సెన్సార్‌ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న దసరా.. నాని సినిమా రన్‌టైమ్‌ ఎంతంటే?

నేను లోకల్‌ వంటి సూపర్‌ హిట్ సినిమా తర్వాత న్యాచురల్‌ స్టార్ నాని- కీర్తి సురేశ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం దసరా. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ శ్రీకాంత్‌ ఓదెల ఈ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయం కానున్నాడు

Dasara Movie: సెన్సార్‌ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న దసరా.. నాని సినిమా రన్‌టైమ్‌ ఎంతంటే?
Nani, Keerthy Suresh
Follow us
Basha Shek

|

Updated on: Mar 20, 2023 | 12:18 PM

నేను లోకల్‌ వంటి సూపర్‌ హిట్ సినిమా తర్వాత న్యాచురల్‌ స్టార్ నాని- కీర్తి సురేశ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం దసరా. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ శ్రీకాంత్‌ ఓదెల ఈ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయం కానున్నాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 30న రిలీజ్‌ కానుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదల కానుంది. నేను లోకల్‌ సినిమాలో క్యూట్‌ లవర్స్‌గా ఆకట్టుకున్న నాని- కీర్తి, దసరా సినిమాలో మాత్రం పూర్తి రస్టిక్‌ క్యారెక్టర్స్‌లో కనిపించనున్నారు. నాని ధరణి అనే ఊర మాస్‌ పాత్రలో నటిస్తుండగా, కీర్తి వెన్నెల అనే క్యారెక్టర్‌ను పోషిస్తోంది. కాగా మరో 10 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న దసరా సినిమా తాజాగా సెన్సార్‌ కూడా పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో యాక్షన్ సీన్లు ఎక్కువగా ఉన్నప్పటికీ సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది.అలాగే కొన్ని బీప్ లు చిన్న కట్ లు మినహా సెన్సార్ బోర్డు దసరా చిత్రానికి కుటుంబాలు, పిల్లలతో సహా అన్ని రకాల ప్రేక్షకులు ఈ సినిమాను చూడవచ్చని తెలిపింది.

ఇక దసరా సినిమా నిడివి విషయానికొస్తే.. ఈ చిత్రం రన్ టైమ్ 2 గంల 36 నిమిషాలు. రన్‌టైమ్‌ ఎక్కువగా ఉన్నప్పటికీ మాస్‌ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్న మూవీ కావడంతో హిట్‌ అవుతుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఇక సెన్సార్‌ బోర్డు సభ్యులు కూడా దసరా సినిమాకు పాజిటివ్‌ రివ్యూలు ఇచ్చారని తెలుస్తోంది. ఈ సినిమాలో సముద్రఖని, సాయికుమార్‌, పూర్ణ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంతోష్‌ నారాయణన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?