Taraka Ratna: అబ్బాయ్‌ని రక్షించుకోవాలని బాబాయ్ తపన.. తారకరత్న చెవిలో మృత్యుంజయ మంత్రం చెప్పిన బాలకృష్ణ

Surya Kala

Surya Kala |

Updated on: Feb 04, 2023 | 7:16 AM

తారకరత్న పరిస్థితి చూసి.. విదేశాలకు తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులు భావించారు. అయితే.. అంత అవసరం లేదన్నట్లు తెలుస్తోంది..విదేశీ వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్‌మెంట్‌ ఇప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారట. తారకరత్న ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు వైద్యులతో మాట్లాడి పరిస్థితి తెలుసుకుంటున్న నందమూరి బాలకృష్ణ శుక్రవారం సాయంత్రం మళ్లీ బెంగళూరు వచ్చారు.

Taraka Ratna: అబ్బాయ్‌ని రక్షించుకోవాలని బాబాయ్ తపన.. తారకరత్న చెవిలో మృత్యుంజయ మంత్రం చెప్పిన బాలకృష్ణ
Balakrishna Tarak

నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది. చికిత్సకోసం ఆయన్ను విదేశాలకు తీసుకెళ్తారా..లేదంటే ఫారిన్ డాక్టర్ల పర్యవేక్షణలో ట్రీట్‌మెంట్‌ చేస్తారా.. యువగళం యాత్రలో సొమ్మసిల్లిపడిపోయిన తారకరత్నకు 45 నిమిషాల సేపు గుండెకు రక్తప్రసరణ జరగలేదన్న డాక్టర్లు ప్రస్తుతం ఎలాంటి ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నారు. శుక్రవారం జరిగిన బ్రెయిన్‌ పరీక్షల్లో ఏం తేలింది..తారకరత్న చెవిలో బాలయ్య మృత్యుంజయ మంత్రం చెప్పడంతోనే కాళ్లలో కదలిక వచ్చిందనే వార్తలో నిజమెంత.. తెలియాల్సి ఉంది. నందమూరి తారకరత్నకు బెంగళూరు నారాయణ హృదయాలయలో ఇంకా వైద్య చికిత్సలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కాస్త మెరుగుపడుతోందని నందమూరి కుటుంబం భావిస్తోంది. బెంగుళూరులో బాలయ్య.. తారకరత్న ఆరోగ్యం ఇలా నందమూరి తారకరత్నకు సంబంధించి ఇప్పటికే అనేక వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయన బ్రెయిన్ డెడ్ రికవరీ చేయడానికి మెదడుకు సంబంధించిన వైద్య చికిత్సలను అందిస్తున్నారు.

ప్రస్తుతం తారకరత్న గుండె, కాలేయం, ఇతర అవయవాలు బాగానే ఉన్నాయని, వైద్యానికి తారకరత్న స్పందిస్తున్నారని చెబుతున్నారు. నందమూరి తారకరత్న ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు వైద్యులతో మాట్లాడి పరిస్థితి తెలుసుకుంటున్న నందమూరి బాలకృష్ణ శుక్రవారం సాయంత్రం మళ్లీ బెంగళూరు వచ్చారు. డాక్టర్లను కలిశారు.

ప్రస్తుతం వైద్యులు తారకరత్న ఆరోగ్యం కొద్దికొద్దిగా మెరుగుపడుతోందని, అవసరమైన వైద్య చికిత్సలను అందిస్తున్నామని బాలకృష్ణకు చెప్పినట్లుగా సమాచారం. తారకరత్న ఆరోగ్యం గురించి బాలకృష్ణ మొదటినుంచి అన్ని తానే అయ్యి దగ్గరుండి చూసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు వైద్యులతో చర్చిస్తూ, కుటుంబ సభ్యులకు భరోసానిస్తూ, తారకరత్న అభిమానులకు ధైర్యం చెబుతున్నారు. త్వరలోనే తారకరత్న ఆరోగ్యంగా తిరిగి వస్తారు అన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

గత నెల 27న గుండెపోటుకు గురైన నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది.. యువగళం పాదయాత్రలో గుండెపోటుతో పడిపోయిన తారకరత్న మెదడుకు 45 నిమిషాలపాటు రక్త ప్రసరణ జరగలేదని..దీంతో తారకరత్న మెదడులో వాపు ఏర్పడిందని గుర్తించారు. న్యూరాలజీ చికిత్సలో నిపుణులైన వైద్యులను నిమ్హాన్స్ ఆసుపత్రి నుంచి రప్పించారు. ఐదు రోజులుగా బ్రెయిన్‌ టెస్టులు చేస్తున్నారు. శుక్రవారం నాటితో బ్రెయిన్ కు సంబంధించి ఐదు రోజుల మెడికేషన్ పూర్తి కావడంతో..ఈజీఓ స్కాన్‌ చేశారు. స్కాన్ రిపోర్ట్‌ వచ్చిన తర్వాత మెదడులో వాపు తగ్గిందా… పనితీరు ఎలా ఉందనే విషయాలపై అధ్యయనం చేయనున్నారు.

అయితే, తారకరత్న పరిస్థితి చూసి.. విదేశాలకు తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులు భావించారు. అయితే.. అంత అవసరం లేదన్నట్లు తెలుస్తోంది..విదేశీ వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్‌మెంట్‌ ఇప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారట.

మరోవైపు, నందమూరి తారకరత్న సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని హిందూపూర్ కు చెందిన తెదేపా నాయకులు పూజలు నిర్వహించారు. తారకరత్న చికిత్స పొందుతున్న ఆసుపత్రి ఆవరణలోని వినాయకస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తారకరత్న కోలుకోవాలని ప్రార్థిస్తూ 101 కొబ్బరి కాయలు కొట్టారు.

అయితే తారకరత్న చెవిలో బాలకృష్ణ మృత్యుంజయ మంత్రం చెప్పారట..ఆ తర్వాతే అతడి కాళ్లలో కదలిక వచ్చినట్లు..బాలయ్య అభిమానులు, టీడీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఏది ఏమైనా.. తారకరత్న మాత్రం అవుటాఫ్‌ డేంజర్‌ అని డాక్టర్లు చెప్పినట్లు..బాలయ్య చెబుతున్నారు. మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu