Nayanthara: అవకాశం ఇస్తాం.. ఫేవర్ కావాలని అడిగాడు.. నయన్ సమాధానం ఇదే..

Ram Naramaneni

Ram Naramaneni |

Updated on: Feb 03, 2023 | 10:04 PM

స్టార్ హీరోయిన్ నయనతారకు కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు తప్పలేదు. తాను కూడా కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నానని చెప్పి బాంబ్ పేల్చారు నయన్.

Nayanthara: అవకాశం ఇస్తాం.. ఫేవర్ కావాలని అడిగాడు.. నయన్ సమాధానం ఇదే..
Nayanthara

సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార  క్యాస్టింగ్ కౌచ్‌‌పై చేసిన కామెంట్స్ పెను దుమారం రేపుతున్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ ఆమె బాంబ్ పేల్చారు. అంతేకాదు కెరీర్ తొలినాళ్లలో తానూ క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఫేస్ చేశానంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అప్పట్లో తనకు సౌత్ ఇండస్ట్రీలో ఓ పెద్ద సినిమాలో నటించే అవకాశం వచ్చిందని… అయితే అందులో ఛాన్స్ కావాలంటే తమకు ఫేవర్ చేయాలని.. అడిగింది చేయాలని కోరినట్లు నయన్ చెప్పుకొచ్చారు.

అడ్డదారుల్లో కాకుండా..  ప్రతిభపై ఎదగాలనుకున్నాను.. అందుకే ఆ అవకాశాన్ని తిరస్కరించినట్లు నయనతార వెల్లడించారు. ప్రజంట్ ఆమె వ్యాఖ్యలు సౌత్‌లో ప్రకపంనలు రేపుతున్నాయి. ఇప్పటికే చాలామంది ప్రముఖ నటీమణులు…  క్యాస్టింగ్‌ కౌచ్‌పై గళమెత్తిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో మాత్రం పెద్దగా ఈ అంశంపై చర్చ జరగడం లేదు. తాజాగా నయన్ మాట్లాడటంతో క్యాస్టింగ్ కౌచ్ టాపిక్ మరోసారి వైరల్ అవుతుంది.

ఇక ఫిల్మ్స్ విషయానికొస్తే.. ‘కనెక్ట్‌’తో గతేడాది ప్రేక్షకులను పలకరించింది నయన్. విరామమే లేని మూవీగా రిలీజై ఇది మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రజంట్ అట్లీ- షారుక్ ఖాన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘జవాన్‌’  మూవీలో ఆమె నటిస్తున్నారు. దర్శకుడు విఘ్నేష్  శివన్‌ను గత ఏడాది జూన్‌లో వివాహమాడింది నయన్. సరోగసి ద్వారా ఈ దంపతులు ఇద్దరు కవలలకు తల్లిదండ్రులు అయ్యారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu