Nandamuri Kalyan Ram: డెవిల్ సినిమాలో కళ్యాణ్ రామ్ ఇలా కనిపించనున్నారా.? ఇది ఫ్యాన్స్ కు కిక్కే కిక్కు
బింబిసారుని జీవిత కథను ఆధారంగా చేసుకుని సోషియో ఫాంటసీ డ్రామా నేపథ్యంలో డెబ్యూ డైరెక్టర్ వశిష్ఠ్ ఈ సినిమాను తెరకెక్కించాడు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై కె. హరికృష్ణ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు.
నందమూరి కళ్యాణ్ రామ్ ఇటీవలే బింబిసార సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్ ఎట్టకేలకు బింబిసార సినిమా తో సాలిడ్ హిట్ అందుకున్నారు. బింబిసారుని జీవిత కథను ఆధారంగా చేసుకుని సోషియో ఫాంటసీ డ్రామా నేపథ్యంలో డెబ్యూ డైరెక్టర్ వశిష్ఠ్ ఈ సినిమాను తెరకెక్కించాడు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై కె. హరికృష్ణ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాతో దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన కల్యాణ్ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ లైనప్ చేసిన సినిమా డెవిల్. కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా ఆమధ్య ఈ సినిమా పోస్టర్ ను రిలీజ్ చేశారు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లోఈ సినిమా తెరకెక్కుతుండగా దీనిపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. తమిళ్ నాడు పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారు చిత్రయూనిట్. డెవిల్ మూవీలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. బ్రిటిష్ వాళ్లు పాలిస్తున్న సమయంలో జరిగిన నిజ సంఘటనల ఆధారంగా ఈ సినిమా ఉండబోతుందట. ఇక యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకు హైలెట్ గా ఉండనున్నాయని తెలుస్తోంది.
ఇక ఈ సినిమాతో పాటే బింబిసార పార్ట్ 2 పై కూడా దృష్టి పెట్టారట కళ్యాణ్ రామ్. బింబిసార మంచి విజయం సాధించడంతో బింబిసార పార్ట్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా కూడా కళ్యాణ్ రామ్ కు ఎలాంటి విజయాలను అందిస్తాయో చూడాలి.