Chandralekha: నాగార్జున చంద్రలేఖ సినిమా సెకండ్ హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
ఇక హీరోయిన్స్ చిన్నప్పటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫొటోస్ వరకు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. తమ అభిమాన హీరోయిన్స్ ఫోటోలు నిత్యం వైరల్ చేస్తూ ఉంటారు.

ఒకప్పటి హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉన్నారు తెలుసుకోవాలన్న ఆసక్తి కొంతమందిలో ఎక్కువగా ఉంటుంది. సోషల్ మీడియాలో ఆ హీరోయిన్స్ కోసం వెతుకుతూ ఉంటారు. ఇక హీరోయిన్స్ చిన్నప్పటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫొటోస్ వరకు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. తమ అభిమాన హీరోయిన్స్ ఫోటోలు నిత్యం వైరల్ చేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఓ హీరోయిన్ గురించి వెతుకుతున్నారు కొందరు నెటిజన్లు. ఆ ఆ హీరోయిన్ ఎవరో కాదు. కింగ్ నాగార్జున నటించిన చంద్ర లేఖ సినిమా గుర్తుందా..? కృష్ణవంశీ దర్శకత్వంలో 1998లో విడుదలైంది ఈ సినిమా. ఈ సినిమాలో హీరోయిన్స్ గా రమ్యకృష్ణ తోపాటు ఇష కొప్పికర్ కూడా నటించింది. అయితే ఇప్పుడు ఇష కొప్పికర్ ఎలా ఉందా.? అని అంతా ఆరా తీస్తున్నారు. ఆమె హిందీతో పాటు, తమిళ, తెలుగు, కన్నడ, మరాఠీ భాషా సినిమాల్లో నటించింది.
చంద్రలేఖ సినిమా తర్వాత ఆమె తెలుగులో నటించిన సినిమా ప్రేమతో రా, ఆ తర్వాత కేశవా అనే సినిమాలో కనిపించింది. ఈ అమ్మడు ఎక్కువ హిందీలో సినిమాలు చేసింది. ఇక ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు.




2009లో టిమ్మీ నారంగ్ ఆమె వివాహం చేసుకున్నారు. వీరికి ఒక సంతానం. ఇప్పటికి ఆమె సినిమాల్లో నటిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు ఇష కొప్పికర్. ఇప్పుడు ఆమె ఎలా ఉన్నారో చూడండి. తరగని అందంతో ఆకట్టుకుంటున్నారు ఇష కొప్పికర్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..