AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Narappa: వెంకీ బర్త్ డే స్పెషల్‌గా నారప్ప రీరిలీజ్.. ఆ రెవెన్యూను ఇలా ఖర్చు చేస్తారట..

వెంకటేష్ కథానాయుకుడిగా, సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ నిర్మాణంలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన 'నారప్ప' కరోనా పరిస్థితుల నేపధ్యంలో ఓటీటీలో విడుదలై బిగ్గెస్ట్ హిట్ ని అందుకుంది

Narappa: వెంకీ బర్త్ డే స్పెషల్‌గా నారప్ప రీరిలీజ్.. ఆ రెవెన్యూను ఇలా ఖర్చు చేస్తారట..
Narappa
Rajeev Rayala
|

Updated on: Dec 11, 2022 | 9:03 AM

Share

విక్టరీ వెంకటేష్ బర్త్ డే కానుకగా డిసెంబర్13న ‘నారప్ప‘ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. తమిళ్ లో సూపర్ హిట్ అయినా అసురన్ సినిమాను తెలుగులో నారప్పగా రీమేక్ చేశారు. వెంకటేష్ కథానాయుకుడిగా, సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ నిర్మాణంలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ‘నారప్ప’ కరోనా పరిస్థితుల నేపధ్యంలో ఓటీటీలో విడుదలై బిగ్గెస్ట్ హిట్ ని అందుకుంది. అయితే ‘నారప్ప’ ని బిగ్ స్క్రీన్ పై చూడాలని ఆశపడ్డారు అభిమానులు. ఇప్పుడు ‘నారప్ప’ థియేటర్స్ లో విడుదలౌతుండటంతో అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. నేపథ్యంలో నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు తెలిపారు.

డిసెంబర్13 వెంకటేష్ బర్త్ డే. ప్రస్తుతం బర్త్ డే రోజుల్లో అభిమానులు, ప్రేక్షకుల కోసం సినిమాలు రీరిలీజ్ ని ఒక ఈవెంట్ లా చేసి విడుదల చేయడం మంచి పరిణామం. ఈ నేపథ్యంలో ఏ సినిమా వేద్దామని ఆలోచిస్తుంటే అభిమానులు నారప్పని థియేటర్ లో చూడాలనివుందని కోరారు. దీంతో బర్త్ డే సందర్భంగా ఒక రోజు థియేటర్ లో వేస్తామని అమెజాన్ కి రిక్వస్ట్ చేశాం. దానికి వారు అంగీకరించారు. రెవెన్యూ గురించి ప్రస్తావన వచ్చినపుడు.. ఇందులో వచ్చే రెవెన్యూ మేము తీసుకోమని చెప్పాం. ఇందులోఎంత రెవెన్యూ వచ్చినా ఆ మొత్తాన్ని చారిటీకే ఇచ్చేస్తాం అని అన్నారు సురేష్ బాబు.

అలాగే ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా చారిటీల కోసం పని చేస్తున్నాను. విజ్ఞాన జ్యోతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కోసం ఎక్కువ సమయం పని చేస్తున్నాను. పిల్లల్ని చదివిస్తే దానికి కంటే మెరుగైన అభివృద్ధి ఈ దేశానికి మరొకటి వుండదని భావిస్తాను. అలాగే పర్యావరణం కోసం కూడా కొంత పని చేస్తున్నాను. ఇటివల ఒక షో కి వెళ్ళినపుడు సినిమా పరిశ్రమలో ఓ టెక్నిషియన్ కి కొంత డబ్బు చారిటీ గా ఇచ్చాం. అయితే అన్ని విభాగాలకు అసోషియేసన్స్ వున్నాయి. సంక్షేమం కంటే అందరిలో స్కిల్ ని ఎలా పెంపొందించాలనే అంశంపై ద్రుష్టి పెట్టాల్సిన అవసరం వుందని భావిస్తాను. విద్య, తగిన నైపుణ్యం మెరుగైన జీవితాన్ని ఇస్తాయి అని అన్నారు సురేష్ బాబు.

ఇవి కూడా చదవండి
Follow Us
ఈపీఎఫ్‌వో వడ్డీ రేట్లపై కేంద్రం క్లారిటీ.. ఈ సారి పెంచకపోవడానికి.
ఈపీఎఫ్‌వో వడ్డీ రేట్లపై కేంద్రం క్లారిటీ.. ఈ సారి పెంచకపోవడానికి.
టిఫిన్ బాక్స్‌తో ముంబై ట్రైన్ ఎక్కాడు.. కట్ చేస్తే.. రూ.42 వేల..
టిఫిన్ బాక్స్‌తో ముంబై ట్రైన్ ఎక్కాడు.. కట్ చేస్తే.. రూ.42 వేల..
ఇదెక్కడి మాస్ రా మావా.. చిరుతతో సరదాగా హోలీ ఆడిన ఊరి జనం.. వీడియో
ఇదెక్కడి మాస్ రా మావా.. చిరుతతో సరదాగా హోలీ ఆడిన ఊరి జనం.. వీడియో
రేయ్ ఎంత దుర్మార్గంరా.. రూ.2వేల కోసం ప్రాణం తీస్తారా..
రేయ్ ఎంత దుర్మార్గంరా.. రూ.2వేల కోసం ప్రాణం తీస్తారా..
విజయ్ విడాకుల విషయంలో వేణు స్వామి సంచలన కామెంట్స్..
విజయ్ విడాకుల విషయంలో వేణు స్వామి సంచలన కామెంట్స్..
చిన్నస్వామి గడ్డపై మళ్ళీ కోహ్లీ గర్జన..ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు పండుగ
చిన్నస్వామి గడ్డపై మళ్ళీ కోహ్లీ గర్జన..ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు పండుగ
నేను, రజినీకాంత్ షూటింగ్‌లో ఒకటే సిగరెట్ కాల్చేవాళ్లం..
నేను, రజినీకాంత్ షూటింగ్‌లో ఒకటే సిగరెట్ కాల్చేవాళ్లం..
టీమిండియాలో వాడే యమ డేంజర్.. ఆ ఒక్కడి కోసం..
టీమిండియాలో వాడే యమ డేంజర్.. ఆ ఒక్కడి కోసం..
క్వీన్ ఎలిజబెత్ రాసిన లేఖ.. భారీ ధరకు వేలం..మ్యాటర్‌ ఏంటంటే..
క్వీన్ ఎలిజబెత్ రాసిన లేఖ.. భారీ ధరకు వేలం..మ్యాటర్‌ ఏంటంటే..
వంకాయ, టమాటా రోటి పచ్చడి ఇలా చేస్తే.. క్యాన్సర్‎ను తరిమికొడుతుంది
వంకాయ, టమాటా రోటి పచ్చడి ఇలా చేస్తే.. క్యాన్సర్‎ను తరిమికొడుతుంది