Anasuya Bharadwaj: హోటల్ వెయిటర్స్‌తో కలిసి స్టెప్పులేసిన అనసూయ.. వీడియో వైరల్
ఈ అమ్మడి అందం గురించి.. ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రముఖ కామెడీ షో ద్వారా అనసూయ చాల పాపులారిటీ సొంతం చేసుకుంది.
టెలివిజన్ అందాల భామల్లో అనసూయ ఒకరు. వయసు పెరుగుతున్నా కొద్దీ తరగని అందంతో ఆకట్టుకుంటోంది అనసూయ. ఈ అమ్మడి అందం గురించి.. ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రముఖ కామెడీ షో ద్వారా అనసూయ చాల పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక యాంకర్ గా రాణిస్తూనే సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంది. అందం అభినయం ఉన్న ఈ భామ చాలా సినిమాల్లో సహాయక పాత్రలు చేసి మెప్పించింది. ముఖ్యంగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా అనసూయకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత అనసూయకు అవకాశాలు వెల్లువెత్తాయి. అలాగే ఐకాన్ స్టార్ట్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలోనూ నటించింది ఈ అమ్మడు. ఇక ఇప్పుడు టీవీ షోలతో, సినిమాలతో బిజీగా ఉన్న అనసూయ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.
నిత్యం తన సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అలాగే తన పై నెగిటివ్ కామెంట్స్ చేసే వారికి తన స్టైల్ లో కౌంటర్లు ఇస్తుంది ఈ చిన్నది. ఈ మధ్యనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి ఓ నెటిజెన్ ను ఆమె అరెస్ట్ చేయించిన సంగతి కూడా తెలిసిందే. తాజాగా అనసూయ కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
తాజాగా అనసూయ ఒక హోటల్ కు వెళ్ళింది. ఆమెను చూడగానే అక్కడ ఉన్న వెయిటర్స్ అంతా ఆమెను ఎంటర్ టైన్ చేయడానికి డాన్స్ చేశారు. అయితే ఆమె కూడా వారితో కలిసి స్టెప్పులేసింది. కన్నడ హీరో సుదీప్ నటించిన విక్రాంత్ రొణ సినిమాలో రా రా రక్కమ్మ సాంగ్ కు అదిరిపోయే మూమెంట్స్ చేసింది అను. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.