Manchu Manoj: మంచు మనోజ్ పాన్ ఇండియా మూవీ ఊసే లేదే.. సినిమా ఆగిపోయిందా..?
మొదటి సినిమాలోనే కామెడీని పంచిన మనోజ్ అందరిచేత అదుర్స్ అనిపించుకున్నారు. రొటీన్ కమర్షియల్ సినిమాలతోపాటు.. సరికొత్త కథలతో ముందుకొచ్చిన మనోజ్.. క్రిష్ డైరెక్షన్ లో ‘వేదం’ మూవీ చేశాడు.
మంచు మనోజ్.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు ఈ యాక్షన్ హీరో. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ కెరీర్ ను స్టార్ట్ చేసిన మంచు మనోజ్.. ‘దొంగా దొంగది’ మూవీతో హీరోగా కనిపించాడు. మొదటి సినిమాలోనే కామెడీని పంచిన మనోజ్ అందరిచేత అదుర్స్ అనిపించుకున్నారు. రొటీన్ కమర్షియల్ సినిమాలతోపాటు.. సరికొత్త కథలతో ముందుకొచ్చిన మనోజ్.. క్రిష్ డైరెక్షన్ లో ‘వేదం’ మూవీ చేశాడు. అయితే చాలా కాలం గ్యాప్ తర్వాత ప్రస్తుతం మంచు మనోజ్ చేస్తున్న సినిమా ‘అహం బ్రహ్మాస్మి’. ఈ సినిమాకు శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. ఎమ్ ఎమ్ ఆర్ట్స్ పతాకం పై మంచు ఫ్యామిలీ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే కొంత కాలంగా ఈ సినిమానుంచి ఎలాంటి ఆప్డేట్ లేదు. దాంతో మనోజ్ ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు.
అసలు ఈ సినిమా ఉందా.. ఆగిపోయిందా అన్న డైలమాలో పడిపోయారు. పాన్ ఇండియా మూవీగా అహం బ్రహ్మాస్మి తెరకెక్కించాలని ప్రయత్నిస్తున్నారు. గతంలో విడుదల చేసిన పోస్టర్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత ఇంతవరకు ఆ మూవీ ఊసే లేదు.
2017లో ఒక్కడు మిగిలాడు అనే సినిమా చేశారు మనోజ్ . ఆ తరువాత మనోజ్ మరో సినిమా చేయలేదు. మూడేళ్లకు పైగా గ్యాప్ తీసుకొని ‘అహం బ్రహ్మాస్మి’ చేస్తున్నారు దాంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా నెటిజన్లు మనోజ్ ను అహం బ్రహ్మాస్మి గురించి ప్రశ్నించగా స్మైలీ ఎమోజి పెట్టి ఊరుకున్నారు. దాంతో ఈ సినిమా ఆగిపోయి ఉంటుందని అంటున్నారు కొందరు నెటిజన్లు. మరి ఈ విషయం పై క్లారిటీ వస్తుందేమో చూడాలి.