Shiva Shankar Master Death: శివ శంకర్ మాస్టర్ మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి – నందమూరి బాలకృష్ణ
ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే.. కరోనా భారిన పడిన ఆయన గత కొద్దీ రోజులుగా ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు.

Shiva Shankar Master : ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే.. కరోనా భారిన పడిన ఆయన గత కొద్దీ రోజులుగా ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 8 గంటలకు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. శివ శంకర్ మాస్టర్(72) హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఆదివారం రాత్రి 8 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల నందమూరి బాలకృష్ణ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా శివ శంకర్ మాస్టర్‌తో ఉన్న అనుబంధాన్ని బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘శివ శంకర్ మాస్టర్ గారితో నాకు మంచి అనుబంధం ఉంది. చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆయనతో కలిసి కొన్ని చిత్రాలకు పని చేయడం జరిగింది. శివ శంకర్ మాస్టర్ అకాల మృతి పట్ల చింతిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢసానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను అని అన్నారు.
అలాగే శివశంకర్ మాస్టర్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి. దర్శక ధీరుడు రాజమౌళి, పవన్ కళ్యాణ్, సోనూసూద్, ఐశ్వర్య రాజేష్ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.భారత చలనచిత్ర పరిశ్రమలో 10 భాషల్లో పనిచేసిన అనుభవం శివశంకర్ మాస్టర్ సొంతం. 800 పైగా చిత్రాలకు కొరియోగ్రఫీ అందించారాయన. దాదాపు 30 సినిమాల్లో నటించారు కూడా. బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్న శివశంకర్ మాస్టర్.. చెన్నైలో పుట్టారు. సలీమ్ మాస్టర్ దగ్గర శిష్యరికం చేశారు. 2011లో మగధీర చిత్రానికి జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు శివశంకర్ మాస్టర్.
మరిన్ని ఇక్కడ చదవండి




