- Telugu News Photo Gallery Cinema photos Actress Shivani Rajasekhar shares her latest saree photos goes viral in social media
Shivani Rajashekar: చీరకట్టులో ‘అద్భుతం’గా అందాల తార.. శివాని రాజశేఖర్ లేటెస్ట్ ఫోటోలు చూశారా.?
Shivani Rajashekar: సీనియర్ హీరో రాజశేఖర్ నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నటి శివాని కెరీర్ తొలినాళ్లలో కొన్ని ఆటుపోట్లు ఎదుర్కొంది. అయితే తాజాగా వచ్చిన అద్భుతం చిత్రంతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది..
Updated on: Nov 29, 2021 | 5:40 AM

తండ్రి రాజశేఖర్ నట వారసత్వంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది శివాని రాజశేఖర్.

అయితే కెరీర్ ప్రారంభంలో పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఒక్క సినిమా కూడా విడుదలకు నోచుకోలేదు.

అడవి శేషుతో నటించిన టూ స్టేట్స్, తమిళంలో ఓ సినిమా పలు కారణాల వల్ల విడుదల కాలేవు. దీంతో ఒకానొక సమయంలో డిప్రెషన్‌లోకి వెళ్లాలని స్వయంగా శివాని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

అయితే తాజాగా ఎట్టకేలకు 'అద్భుతం' సినిమాతో తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై తళుక్కుమంది శివాని. ఇందులో శివాని నటకు మంచి మార్కులు పడ్డాయి.

తొలి సినిమాలోనే తనదైన నటనతో ఆకట్టుకున్న ఈ క్యూట్ గర్ల్. నటనలో తండ్రికి తగ్గ తనయగా పేరు సంపాదించుకుంది. ఈ సినిమా విజయవంతం కావడంతో ఒక్కసారిగా శివాన్ పేరు ఇండస్ట్రీలో మారుమోగింది.

ఇందుకు అనుగుణంగానే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా మారిన శివాని తన లేటస్ట్ ఫోటోలతో కుర్రకారును తనవైపు తిప్పుకుంటోంది. ఇందులో భాగంగానే తాజాగా చీర కట్టులో దిగిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.




