AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika: అందాల రష్మిక మోటివేషనల్‌ పోస్ట్‌.. భయాన్ని ఎలా జయించాలో ఎంత బాగా చెప్పిందే చూడండి..

Rashmika Mandanna: 'ఛలో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పలకరించిన అందాల తార రష్మిక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస అవకాశాలు.. బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్‌లతో..

Rashmika: అందాల రష్మిక మోటివేషనల్‌ పోస్ట్‌.. భయాన్ని ఎలా జయించాలో ఎంత బాగా చెప్పిందే చూడండి..
Rashmika Mandanna
Narender Vaitla
|

Updated on: Nov 29, 2021 | 5:43 AM

Share

Rashmika Mandanna: ‘ఛలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పలకరించిన అందాల తార రష్మిక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస అవకాశాలు.. బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్‌లతో గోల్డెన్‌ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి చిత్రాలతో పాపులర్‌ నటిగా పేరు సంపాదించుకుంది. దీంతో రష్మిక రేంజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో ‘పుష్ఫ’ చిత్రంలో నటిస్తోన్న ఈ చిన్నది.. ఇప్పుడు నేషనల్‌ క్రష్‌గా మారిపోయింది. బాలీవుడ్‌లో సినిమా అవకాశాలు దక్కించుకుంటూ నేషనల్‌ హీరోయిన్‌గా మారింది. దీంతో బాలీవుడ్‌లోనూ ఈ అందాల తార పేరు మారుమోగుతోంది.

ఇదిలా ఉంటే సినిమాలతో నిత్యం బిజీగా ఉండే ఈ చిన్నది.. సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్‌ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్‌ చేసిన ఓ పోస్ట్‌ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మనకు జీవతంలో ఎదురయ్యే చిన్న చిన్న భయాలను ఎలా అదిగమించాలో అద్భుతంగా చెప్పుకొచ్చిందీ బ్యూటీ.

రష్మిక పోస్టులో ఏముందంటే.. ‘అగ్నిగుండాలలాంటి భయాల నుంచి సురక్షితంగా బయట పడాలనుకుంటున్నారా.. అయితే ముందుగా ఆ భయమేంటో తెలుసుకోండి. మరొకరితో పోల్చుకొని కృంగిపోతున్నారా? అనవసరంగా ఆందోళనకు గురవుతున్నారా? ఇవే మీ భయాలైతే వాటి నుంచి ధైర్యంగా అడుగు బయట వేయండి. మీ మానసిక శక్తులకు పదునుపెడుతూ వాటిని ఎలా అధిగమించాలో సాధన చేయండి. తొందరలోనే ఫలితాన్ని చూస్తారు. ఇంత చిన్న విషయాలకా.. నేను భయపడ్డది. అని మీరే ఆశ్చర్యపోతారు. నేను హీరోయిన్‌గా రాణించానంటే.. నాలోని భయాల్ని జయించడమే కారణం’ అంటూ తనదైన శైలిలో రాసుకొచ్చిందీ బ్యూటీ.

Also Read: Pomelo Fruit: ఈ సీజనల్ ఫ్రూట్ మహిళకు ఎంత మేలు చేస్తుందో తెలిస్తే ?? వీడియో

Omicron Variant: ఆంక్షలున్నప్పటికీ అందాల పోటీలు నిర్వహిస్తాం.. స్పష్టం చేసిన ఇజ్రాయెల్‌ ప్రభుత్వం..

నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగ అవకాశాలు..