Daaku Maharaaj: డాకు మహారాజ్‌గా బాలయ్య అరాచకం.. పక్కా కమర్షియల్ పండుగ సినిమా ఇది

సంక్రాంతి + మాస్ సినిమా=డెడ్లీ కాంబినేషన్. దీని మించిన కాంబినేషన్ ఇంకోటి లేదు. అందుకే తమ సినిమాలను సంక్రాంతికి తీసుకురావాలని మాక్సిమం ట్రై చేస్తుంటారు దర్శక నిర్మాతలు. డాకు మహారాజ్ అచ్చంగా ఇలాంటి సినిమానే. పండక్కి ఏమేం కావాలో అన్ని మసాలాలు దట్టించి ఈ సినిమాను తీసుకొచ్చాడు బాబి.

Daaku Maharaaj: డాకు మహారాజ్‌గా బాలయ్య అరాచకం.. పక్కా కమర్షియల్ పండుగ సినిమా ఇది
Daaku Maharaaj
Follow us
Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Ravi Kiran

Updated on: Jan 12, 2025 | 12:02 PM

మూవీ రివ్యూ: డాకు మహారాజ్ నటీనటులు: నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతెలా, బాబి డియోల్, సచిన్ ఖేడ్, షేన్ టామ్ చాకో తదితరులు సంగీతం: తమన్ ఎడిటర్: నిరంజన్ దేవరమానే, రూబెన్ సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బాబీ కొల్లి

అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఇలా సాగుతుంది బాలకృష్ణ దండయాత్ర బాక్సాఫీస్ మీద. తాజాగా ఈయన సంక్రాంతికి డాకు మహారాజ్ అంటూ వచ్చాడు. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ చేసిన సినిమా ఇది. మరి ఇది ఎలా ఉంది.. ప్రేక్షకులను అలరించిందా లేదా అనేది పూర్తిగా చూద్దాం..

కథ:

ఇవి కూడా చదవండి

మదనపల్లె ప్రాంతంలో టీ ఎస్టేట్ ముసుగులో జంతువుల చర్మం, ఏనుగు దంతాలు స్మగ్లింగ్‌తో ఎమ్మెల్యే త్రిమూర్తులు నాయుడు (రవికిషన్), అతని తమ్ముడు మనోహర్ నాయుడు (సందీప్ రాజ్) అరాచకాలు చేస్తుంటారు. అనుకోకుండా వాటిని ఒకరోజు బేబీ వైష్ణవి చూస్తుంది. విషయం వాళ్ల తాత, టీ ఎస్టేట్ ఓనర్ కృష్ణమూర్తి (సచిన్ ఖేడ్కర్) కు చేరవేస్తుంది. దాంతో ఆ కుటుంబాన్ని చంపడానికి ఎమ్మెల్యే ప్రయత్నిస్తాడు. అప్పుడు వాళ్ళను కాపాడడానికి నానాజీ అలియాస్ డాకు మహారాజ్ అలియాస్ సీతారాం (బాలకృష్ణ) వస్తాడు. వచ్చి రాగానే ఎమ్మెల్యేకు ధమ్కి ఇస్తాడు. వాళ్ళు చేస్తున్న పనులు వెంటనే ఆపేయాలి అని వార్నింగ్ ఇస్తాడు. ఇదంతా పైన ఉన్న బలవంత్ సింగ్ ఠాగూర్ (బాబి డియోల్) కు తెలుస్తుంది. అయితే బలవంతుతో నానాజీకి ఇంతకుముందే పరిచయం ఉంటుంది. దానికి ఒక పెద్ద ఫ్లాష్ లైట్ స్టోరీ ఉంటుంది. మరి అదేంటి.. అప్పుడు వాళ్ళు ఏం చేశారు.. దానికి బదులుగా డాకు మహారాజు వాళ్లకు ఏం చేశాడు అనేది మిగిలిన కథ..

కథనం:

సంక్రాంతి + మాస్ సినిమా=డెడ్లీ కాంబినేషన్. దీని మించిన కాంబినేషన్ ఇంకోటి లేదు. అందుకే తమ సినిమాలను సంక్రాంతికి తీసుకురావాలని మాక్సిమం ట్రై చేస్తుంటారు దర్శక నిర్మాతలు. డాకు మహారాజ్ అచ్చంగా ఇలాంటి సినిమానే. పండక్కి ఏమేం కావాలో అన్ని మసాలాలు దట్టించి ఈ సినిమాను తీసుకొచ్చాడు బాబి. కథ గురించి అడక్కండి.. కొన్ని వందల సినిమాల్లో చూసాం..! టెంప్లేట్ కమర్షియల్ సినిమా..! అలాగని మరీ తీసి పారేసే కథ కాదు. సమాజానికి ఉపయోగపడే నీటి గురించి చెప్పే కథ ఇది. ట్విస్టులు ఎక్స్పెక్ట్ చేయకుండా.. కొత్త కథ కావాలి అని కంప్లైంట్ లేకుండా వెళ్తే థియేటర్ కి వెళ్లిన వాళ్లకు తన స్క్రీన్ ప్రజెంట్ తో మెంటల్ ఎక్కించేస్తాడు బాలయ్య. ఫస్టాఫ్ వరకు అసలు ఏ కంప్లైంట్స్ అవసరం లేదు. సినిమాలో బాలయ్య గుర్రంలా పరుగులు పెట్టింది స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ లో. సీన్ లో ఉన్నా లేకపోయినా.. జస్ట్ బాలయ్య ఇమేజ్ థియేటర్లో అరుపులు పుట్టించింది. ముఖ్యంగా రజనీకాంత్ జైలర్ తరహా స్క్రీన్ ప్లే ఇందులో రాసుకున్నాడు బాబి. హీరో సీన్ లో ఉన్నా లేకపోయినా వెనకాల ఆయన కనిపించేలా స్క్రీన్ ప్లే ఉంటుంది. కేవలం బాలయ్య ఇమేజ్ ఈ కథను ముందుకు నడిపిస్తుంది. చిన్న పాపతో వచ్చే సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. దబిడ దిబిడే సాంగ్ మాస్ ఆడియన్స్ కు పండగ. ప్రీ ఇంటర్వెల్ నుంచి 20 నిమిషాల సినిమా పీక్స్. అక్కడి వరకు సూపర్ హై చూపించిన బాబీ.. సెకండ్ హాఫ్ కాస్త వదిలేసాడు అనిపించింది. సెకండ్ ఆఫ్ ఓపెన్ అవడంతోనే ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. అనగనగా ఒక ఊరు.. అక్కడ నీటి కోసం జనాలు పడుతున్న కష్టాలు.. వాటిని తీర్చడానికి వచ్చే హీరో.. అక్కడి వాళ్లకు నీళ్లు రాకుండా చేసే విలన్.. ఈ నాలుగు ముక్కల్లో సెకండ్ హాఫ్ మొత్తం అయిపోతుంది. నిజం చెప్పాలంటే ఫస్ట్ అఫ్ రేంజ్ లో కిక్ ఇవ్వదు కానీ సెకండ్ హాఫ్ లో కూడా రెండు మూడు సీన్స్ బలంగా రాసుకున్నాడు బాబీ. బాలయ్య అసలు డాకు మహారాజుగా ఎందుకు మారాడు అనే పాయింట్ బాగుంది. అనవసరపు కామెడీ సీన్స్ కి వెళ్ళకుండా అనుకున్నది అనుకున్నట్టు సీరియస్ సినిమా తీశాడు బాబీ. క్లైమాక్స్ కూడా ఏదో హడావిడిగా ముగించినట్టు అనిపిస్తుంది. పండక్కి బాలయ్య అభిమానులతో పాటు కమర్షియల్ సినిమా కోరుకునే ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డాకు మహారాజ్ ఫుల్ మీల్స్ పెడుతుంది.

నటీనటులు:

బాలయ్య గురించి ఏం చెప్పాలి.. ఆయన అదుర్స్ అంతే. ఈ వయసులో కూడా డూప్ లేకుండా కుమ్మేసాడు. ఆయన ఎనర్జీ నెక్స్ట్ లెవెల్. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేల.. వీళ్ళందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. బాబి డియోల్ మరోసారి తనదైన విలనిజం చూపించాడు. రవి కిషన్, సందీప్ రాజ్ కూడా పర్లేదు. దసరా విలన్ షైన్ టామ్ చాకో క్యారెక్టర్ బాగుంటుంది. మిగిలిన వాళ్ళందరూ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

టెక్నికల్ టీం:

బాలయ్య కోసం తమన్ మరోసారి డ్యూటీ ఎక్కాడు. సినిమాలో పాటలు తక్కువగానే ఉన్నాయి కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది. సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. ఎడిటింగ్ కూడా షార్ప్ గానే అనిపించింది. సెకండాఫ్ కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి కానీ దర్శకుడు నిర్ణయం కాబట్టి ఏమీ మాట్లాడలేము. బాబి ఈసారి కూడా అదే పక్కా ఫక్తు కమర్షియల్ సినిమాతో వచ్చాడు. కథ రొటీన్ గానే ఉన్నా స్క్రీన్ ప్లే మాత్రం బాగా రాసుకున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. కథకు ఏమేం కావాలో అన్ని సమకూర్చారు వీళ్ళు.

పంచ్ లైన్:

ఓవరాల్ గా డాకు మహారాజ్.. పక్కా కమర్షియల్ పండగ సినిమా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

డాకు మహారాజ్‌గా బాలయ్య అరాచకం.. పక్కా కమర్షియల్ పండుగ సినిమా
డాకు మహారాజ్‌గా బాలయ్య అరాచకం.. పక్కా కమర్షియల్ పండుగ సినిమా
ఈసారి ఆన్‌లైన్‌లోనే నీట్‌ యూజీ 2025 పరీక్ష..!
ఈసారి ఆన్‌లైన్‌లోనే నీట్‌ యూజీ 2025 పరీక్ష..!
వీటిని ఎలా తింటారురా.! పండక్కి వస్తే పైలోకానికే పార్శిల్ చేసేలా..
వీటిని ఎలా తింటారురా.! పండక్కి వస్తే పైలోకానికే పార్శిల్ చేసేలా..
UNO నిపుణుల కమిటీలో సభ్యత్వం పొందిన భారత్.. కేంద్రం వెల్లడి
UNO నిపుణుల కమిటీలో సభ్యత్వం పొందిన భారత్.. కేంద్రం వెల్లడి
మహాకుంభమేళా ద్వారా రూ.2లక్షల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం
మహాకుంభమేళా ద్వారా రూ.2లక్షల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం
వామ్మో.. రూ.36000 కోట్ల విలువైన డ్రగ్స్ ధ్వంసం..ఎలా తగలబెట్టారంటే
వామ్మో.. రూ.36000 కోట్ల విలువైన డ్రగ్స్ ధ్వంసం..ఎలా తగలబెట్టారంటే
సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఇంటర్నేషనల్‌ కైట్‌ ఫెస్టివల్‌
సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఇంటర్నేషనల్‌ కైట్‌ ఫెస్టివల్‌
పొద్దున్నే తన పొలానికి వెళ్లిన రైతుకు షాక్..
పొద్దున్నే తన పొలానికి వెళ్లిన రైతుకు షాక్..
రాజేంద్రనగర్‌లో చిరుత కలకలం.. తీవ్ర భయాందోళనలో స్థానికులు
రాజేంద్రనగర్‌లో చిరుత కలకలం.. తీవ్ర భయాందోళనలో స్థానికులు
జోబైడెన్‌ సర్కార్‌పై మెటా సీఈఓ జుకర్‌బర్గ్ విమర్శలు
జోబైడెన్‌ సర్కార్‌పై మెటా సీఈఓ జుకర్‌బర్గ్ విమర్శలు