Balakrishna: బాలయ్య సెంటిమెంట్.. డాకు మహారాజ్ మూవీలోనూ రిపీట్..!
గత కొంత కాలంగా బాలయ్య ఓ సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు. జానర్ ఏదైనా.. డైరెక్టర్ ఎవరైనా.. నందమూరి హీరోతో సినిమా అంటే ఆ సెంటిమెంట్ పక్కాగా ఫాలో అవుతున్నారు. ఎన్ని మసాల ఎలిమెంట్స్ ఉన్నా.. ఆ ఎమోషన్ కూడా పక్కాగా ఉండేలా చూసుకుంటున్నారు. ఈ ఫార్ములా సక్సెస్ లోనూ కీ రోల్ ప్లే చేస్తోంది. ఇప్పుడు మళ్లీ అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు. దీంతో సక్సస్ పక్కా అంటున్నారు.
బాలయ్య సినిమా అంటే మాస్ యాక్షన్ సీన్స్ లు, పంచ్ డైలాగులు, ఇద్దరు హీరోయిన్ లు పక్కా ఉంటారు. వీటితో పాటు మరో సెంటిమెంట్ ను కూడా పక్కాగా ఫాలో అవుతున్నారు నందమూరి నటసింహాం. రీసెంట్ టైమ్స్ లో బాలయ్య సినిమాలో ఓ పాయింట్ రిపీటెడ్ గా కనిపిస్తోంది. జానర్ ఏదైనా.. డైరెక్టర్ ఎవరైనా.. నందమూరి హీరోతో సినిమా అంటే ఆ సెంటిమెంట్ పక్కాగా ఫాలో అవుతున్నారు. ఎన్ని మసాల ఎలిమెంట్స్ ఉన్నా.. ఆ ఎమోషన్ కూడా పక్కాగా ఉండేలా చూసుకుంటున్నారు నందమూరి నటసింహం. ఈ ఫార్ములా సక్సెస్ లోనూ కీ రోల్ ప్లే చేస్తోంది.
రీసెంట్ టైమ్స్ లో బాలయ్య సినిమాలో చైల్డ్ సెంటిమెంట్ గ్యారెంటీ గా ఉండేలా చూసుకుంటున్నారు. అఖండ సినిమాలో కథను మలుపు తిప్పే పాత్రలో ఓ చిన్నారి కనిపించారు. పాప ప్రాణం కాపాడటం కోసమే జనం జీవనం లోకి వచ్చే అఘోరాగా కనిపించారు బాలయ్య. ఇప్పుడు పార్ట్ 2 విషయంలో ఆ పాపకు ఇచ్చే మాటనే లీడ్ గా తీసుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది.
అఖండ 2 సెంటిమెంట్ ను వీరసింహా రెడ్డి లోనూ కంటిన్యూ చేశారు బాలయ్య. అయితే ఈ సినిమాలో పూర్తిగా చిన్న పిల్లల మీదే కథ నడిపించకపోయినా… చెల్లెలి సెంటిమెంట్ సీన్స్ ను చాలా బాగా చూపించారు. సినిమా సక్సెస్ లో ఆ సీన్స్ కీ రోల్ ప్లే చేశాయి.
రీసెంట్ బ్లాక్ బస్టర్ భగవంత్ కేసరి విషయం లోనూ ఇదే ట్రెండ్ ఫాలో అయ్యారు. తనకు ఏ మాత్రం సంబంధం లేని ఓ చిన్నారి కోసం భగవంత కేసరి ఏం చేశాడన్నదే ఈ సినిమా కథ. సినిమాలో ఎక్కువ భాగం బాలయ్య – శ్రీలీల పాత్రలే కనిపించినా.. ఒక్క పాట, కొన్ని సీన్స్‌లో చిన్న పాపతో కనిపించి ఫ్యామిలీ ఆడియన్స్ ను కట్టి పడేశారు నందమూరి హీరో.
ఇప్పడు రిలీజ్ కు రెడీ అవుతున్న డాకు మహారాజ్ లోనూ ఇదే సెంటిమెంట్ ను కంటిన్యూ చేస్తున్నారు నందమూరి హీరో. ఈ సినిమా లోనూ చైల్డ్ సెంటిమెంట్ కు పెద్ద పీట వేసినట్టుగా తెలుస్తోంది. సెకండ్ సింగిల్ ఎనౌన్స్‌మెంట్ తో ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు మేకర్స్. దీంతో డాకు మహారాజ్ లోనూ బాలయ్య సెంటిమెంట్ ను రిపీట్ చేస్తున్నారని ఫిక్స్ అయ్యారు. దీంతో గత చిత్రాల సక్సెస్ లో కీ రోల్ ప్లే చేసిన చైల్డ్ సెంటిమెంట్ డాకు మహారాజ్ విషయంలోనూ రిపీట్ అవుతుందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్.