AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keerthy Suresh: మన హీరోయిన్ల డెడికేషన్‌కు ఫిదా కావాల్సిందే..! ఇప్పుడు ఆ లిస్ట్‌లో కీర్తి సురేష్..!

ఇటీవల పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్‌ లోకి ఎంటర్‌ అయిన కీర్తి సురేష్‌.. వారం రోజులు కూడా తిరక్కుండానే సినిమా పనులు స్టార్ట్ చేశారు. తన బాలీవుడ్ డెబ్యూ మూవీ బేబీ జాన్‌ ప్రమోషన్స్‌ లో పాల్గొంటున్నారు. నార్త్ మూవీ కావటంతో ఆ సినిమా కంటెంట్‌ కు తగ్గట్టుగా హాట్‌ లుక్స్‌ తో కనిపిస్తూనే మన సాంప్రదాయం పట్ట తనకున్న గౌరవాన్ని కూడా చూపిస్తున్నారు.

Keerthy Suresh: మన హీరోయిన్ల డెడికేషన్‌కు ఫిదా కావాల్సిందే..! ఇప్పుడు ఆ లిస్ట్‌లో కీర్తి సురేష్..!
Keerthy Suresh
Satish Reddy Jadda
| Edited By: |

Updated on: Dec 20, 2024 | 6:00 PM

Share

కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్‌ అంటే కేవలం ఆరు పాటలు నాలుగు సీన్స్‌ కు మాత్రమే పరిమితం అన్నట్టుగా ఉండేది ఇన్నాళ్లు పరిస్థితి. కానీ ఇప్పుడు సీన్ మారింది. స్టార్ హీరోయిన్లు కమర్షియల్ సినిమాల్లోనూ తమ మార్క్‌ చూపించేందుకు కష్టపడుతున్నారు. గ్లామర్‌ తో పాటు నటనకు కూడా స్కోప్ ఉండే రోల్స్‌ ను ఏరి కోరి సెలెక్ట్ చేసుకుంటున్నారు. కేవలం సినిమాలో నటించటం వరకే కాదు ఆ సినిమాల ప్రమోషన్ బాధ్యతలను కూడా నెత్తికెత్తు కుంటున్నారు. తమ పర్సనల్ లైఫ్‌ ఎఫెక్ట్ ఏ మాత్రం సినిమాల మీద పడకుండా చూసుకుంటున్నారు. అందుకే కోసం రిస్క్ చేసేందుకు కూడా రెడీ అంటున్నారు.

రీసెంట్‌ గా పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్‌ లోకి ఎంటర్‌ అయిన కీర్తి సురేష్‌.. వారం రోజులు కూడా తిరక్కుండానే సినిమా పనులు స్టార్ట్ చేశారు. తన బాలీవుడ్ డెబ్యూ మూవీ బేబీ జాన్‌ ప్రమోషన్స్‌ లో పాల్గొంటున్నారు. నార్త్ మూవీ కావటంతో ఆ సినిమా కంటెంట్‌ కు తగ్గట్టుగా హాట్‌ లుక్స్‌ తో కనిపిస్తూనే మన సాంప్రదాయం పట్ట తనకున్న గౌరవాన్ని కూడా చూపిస్తున్నారు కీర్తి. బేబీ జాన్ ప్రమోషన్స్‌ లో మెడలో పసుపు తాడుతోనే కనిపిస్తున్నారు ఈ బ్యూటీ.

బేబీ జాన్ మూవీ ప్రమోషన్స్‌లో కీర్తి సురేష్..

గతంలో దీపిక..

కీర్తి సురేష్ మాత్రమే కాదు బాలీవుడ్ టాప్ బ్యూటీ దీపిక పదుకోన్‌ కూడా ఇదే డెడికేషన్ చూపించారు. కల్కి 2898 ఏడీ సినిమా రిలీజ్‌ టైమ్‌ కు నిండు గర్భవతిగా ఉన్న దీపిక, ఆ సినిమా ప్రమోషన్స్‌ లో యాక్టివ్‌ గా పాల్గొన్నారు. దేశమంత తిరిగి అవకాశం లేకపోవటంతో మీడియా ఇంటర్వ్యూ లతో పాటు ముంబై ప్రమోషన్స్‌ లో యాక్టివ్‌ గా పాల్గొని సినిమాకు నార్త్‌ లో మంచి హైప్‌ తీసుకువచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేశారు.

అలియా భట్ కూడా..

మరో స్టార్ హీరోయిన్ అలియా భట్‌ కూడా సినిమా కోసం చాలా రిస్క్ చేశారు. బ్రహ్మాస్త్ర సినిమా టైమ్‌ లో ప్రెగ్నెంట్‌ అయిన అలియా, అలాగే ఆ సినిమాను పూర్తి చేశారు. ఆ తరువాత ప్రమోషన్స్‌ లోనూ గర్భవతిగానే పాల్గొన్నారు. అదే టైమ్‌ లో సెట్స్‌ మీద ఉన్న హాలీవుడ్ యాక్షన్ మూవీ హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌ షూటింగ్‌ లోనూ పాల్గొన్నారు. ఆ సినిమా కోసం ప్రెగ్నెంట్‌ గా ఉండే రిస్కీ స్టంట్స్ కూడా చేశారు ఆలియా భట్‌. మరో బాలీవుడ్ బ్యూటీ నేహా దూపియా కూడా గర్భవతిగా ఉండి ఓ వెబ్‌ సిరీస్‌ లో నటించారు.

Follow Us
గంభీర్ కోచింగ్‌లో టీమిండియా బద్దలు కొట్టిన దారుణమైన రికార్డులివే
గంభీర్ కోచింగ్‌లో టీమిండియా బద్దలు కొట్టిన దారుణమైన రికార్డులివే
ఓటీటీని షేక్ చేస్తున్న 5 వెబ్ సిరీస్ లు..
ఓటీటీని షేక్ చేస్తున్న 5 వెబ్ సిరీస్ లు..
రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు
ఉద్యోగం చేసే ఆడవాళ్లు తినాల్సిన మాంసం కారం పొడి..
ఉద్యోగం చేసే ఆడవాళ్లు తినాల్సిన మాంసం కారం పొడి..
హైరైజ్ బిల్డింగ్‌లకి కొత్త రూల్.. ఇకపై ఆ సిస్టమ్ ఉంటేనే పర్మిషన్
హైరైజ్ బిల్డింగ్‌లకి కొత్త రూల్.. ఇకపై ఆ సిస్టమ్ ఉంటేనే పర్మిషన్
వర్షాకాలంలో ఏసీ వాడేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
వర్షాకాలంలో ఏసీ వాడేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
కేవలం రూ.10,000 సిప్‌తో మీరు ఒక BMWని కొనవచ్చు.. ఎలాగో తెలుసా..?
కేవలం రూ.10,000 సిప్‌తో మీరు ఒక BMWని కొనవచ్చు.. ఎలాగో తెలుసా..?
కంసాలి ఆశ్చర్యపోవాల్సిందే..ఇంట్లోనే బంగారు నగలకు ఇలా మెరుగులు!
కంసాలి ఆశ్చర్యపోవాల్సిందే..ఇంట్లోనే బంగారు నగలకు ఇలా మెరుగులు!
గిల్, శ్రేయాస్ పట్ల ఒకలా.. వైభవ్ పట్ల మరోలా.. ఇలా ఎలా గంభీర్?
గిల్, శ్రేయాస్ పట్ల ఒకలా.. వైభవ్ పట్ల మరోలా.. ఇలా ఎలా గంభీర్?