Balayya: ఎప్పుడో 1993-94లో.. మళ్లీ ఇన్నేళ్లకు.. బాలయ్యకు ఆ లోటు ఇప్పుడు తీరింది
గత 30 ఏళ్ళలో 47 సినిమాలు చేసారు బాలయ్య. ఇన్నేళ్ళలో ఒక్కసారి కూడా రెండు వరస విజయాలు అందుకోలేదు. సమరసింహారెడ్డి తర్వాత వచ్చిన సుల్తాన్ యావరేజ్ దగ్గరే ఆగింది కానీ హిట్ కాదు.

30 ఏళ్ళు.. 47 సినిమాలు.. ఏంటీ లెక్కలు అనుకుంటున్నారా..? వరసగా రెండు హిట్లు కొట్టడానికి బాలయ్య తీసుకున్న టైమ్ గ్యాప్ ఇది. వినడానికి విచిత్రంగా.. నమ్మడానికి కాస్త కష్టంగా అనిపిస్తుంది కానీ ఇదే నిజం. కొన్నిసార్లు దగ్గరగా వచ్చారు కానీ గెలుపు తలుపుకు అడుగు దూరంలో ఆగిపోయారు బాలయ్య. ఇన్నేళ్ళకు బోయపాటి, గోపీచంద్ మలినేని 30 ఏళ్ళ నిరీక్షణకు తెరదించారు. ఏడాదికో సినిమా.. కుదిర్తే రెండు సినిమాలు చేయడం బాలయ్యకు ఎప్పట్నుంచో ఉన్న అలవాటు. ఇప్పటికీ అదే దూకుడు చూపిస్తున్నారీయన. కానీ విజయాల విషయంలో మాత్రం కాస్త వెనకబడే ఉంటారు నటసింహం. హిట్ కొట్టినపుడు మాత్రం ఆ ఇంపాక్ట్ మరో రెండు మూడేళ్ళ వరకు ఉండేలా చూసుకుంటారు బాలయ్య. తాజాగా వీరసింహారెడ్డితో మరోసారి మాస్ మ్యాజిక్ చేసి చూపించారు ఈ సీనియర్ హీరో.
జనవరి 12న విడుదలైన వీరసింహారెడ్డి 8 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయింది. అఖండ సినిమా కలెక్షన్లను కూడా దాటేసింది ఈ సినిమా. తెలుగు రాష్ట్రాల్లోనే 8 రోజుల్లో 60 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన ఈ చిత్రం.. ప్రపంచ వ్యాప్తంగా 71 కోట్లు వసూలు చేసింది. ఈ విజయంతో మూడు దశాబ్ధాల తర్వాత బాలయ్య వరసగా రెండు హిట్లు అందుకున్నారు. చివరగా 1993-94 సమయంలో బంగారు బుల్లోడు, భైరవ ద్వీపంతో వరస విజయాలు అందుకున్నారు బాలయ్య.
గత 30 ఏళ్ళలో 47 సినిమాలు చేసారు బాలయ్య. ఇన్నేళ్ళలో ఒక్కసారి కూడా రెండు వరస విజయాలు అందుకోలేదు. సమరసింహారెడ్డి తర్వాత వచ్చిన సుల్తాన్ యావరేజ్ దగ్గరే ఆగింది కానీ హిట్ కాదు. ఆ తర్వాత అలాంటి యావరేజ్ కూడా రాలేదు. ఈ లోటు ఇన్నేళ్లకు అఖండ, వీరసింహారెడ్డిలతో తీరిపోయింది. అఖండ బ్లాక్‌బస్టర్ కాగా.. వీరసింహారెడ్డి ఏ రేంజ్‌లో ఆగుతుందో చూడాలిక. ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమాతో బిజీగా ఉన్నారు బాలయ్య.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.