AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagababu: చిరంజీవి తల్లి అంజనా దేవీకి అస్వస్థత.. స్పందించిన నాగబాబు

చిరంజీవి తల్లి అంజనా దేవి మంగళవారం (జూన్ 24) తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, ఆస్పత్రికి తరలించారన్న వార్తలు ఉదయం నుంచి సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఇక తల్లి ఆరోగ్యం బాలేదని తెలసి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారన్న కథనాలు మెగాభిమానులను ఆందోళనకు గురి చేశాయి.

Nagababu: చిరంజీవి తల్లి అంజనా దేవీకి అస్వస్థత.. స్పందించిన నాగబాబు
Nagababu
Basha Shek
|

Updated on: Jun 24, 2025 | 4:06 PM

Share

మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ పాలయ్యారంటూ మంగళ వారం (జూన్ 24) ఉదయం నుంచి సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. అంజనా దేవి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆమెను అపోలో ఆస్పత్రికి తరలించారంటూ వార్తలు వచ్చాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న హీరో చిరంజీవి తన షూటింగ్ పనులను పక్కన పెట్టి హైదరాబాద్ వచ్చారని ప్రచారం జరిగింది. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా క్యాబినేస్ సమావేశం మధ్యలోనే హైదరాబాద్ కు పయనమయ్యారని పుకార్లు షికార్లు చేశాయి. దీంతో మెగాభిమానులు కాస్త కంగారు పడ్డారు. అంజనా దేవి త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు షేర్ చేశాడు. అయితే అంజనమ్మ ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఒక పోస్ట్ పెట్టారు. ‘అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది”. అమ్మ ఆరోగ్యం గురించి తప్పుడు సమాచారం బయటకు వచ్చింది. ఆరోగ్యపరంగా ఆమె పూర్తిగా క్షేమంగా ఉన్నారు’ అంటూ నాగబాబు ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఈ పోస్ట్ తో మెగాభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

వయసు పైబడుతున్న నేపథ్యంలో అంజనా దేవి జనరల్ చెకప్ కోసం తరచూ ఆస్పత్రికి వెళ్లి వస్తుంటారు. అయితే ఈ నేపథ్యంలోనే అంజనమ్మ ఆరోగ్యంపై రూమర్లు పుట్టుకొస్తున్నాయి. గతంలోనూ ఇలాగే జరగ్గా మెగా ఫ్యామిలీ క్లారిటీ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

నాగ బాబు ట్వీట్..

ఇక సినిమాల విషయానికి వస్తే..  ప్రస్తుతం చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి