Naga Shaurya: ‘అలాంటి సీన్స్‌లో నేను చాలా వీక్’.. నాగశౌర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య సాలిడ్ హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. తాజాగా ఈ కుర్ర హీరో నటించిన కృష్ణ వ్రింద విహారి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య(Naga Shaurya) సాలిడ్ హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. తాజాగా ఈ కుర్ర హీరో నటించిన కృష్ణ వ్రింద విహారి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో దుసుకుపోతోంది. ఈ సినిమాకు అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహించగా ఐరా క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మించారు. ఈ చిత్రంతో షిర్లీ సెటియా అనే న్యూజిలాండ్ బ్యూటీ టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు హీరో నాగశౌర్య. ఆయన మాట్లాడుతూ.. కృష్ణ వ్రింద విహారి’ కథ 2020 కోవిడ్ ఇంకా మొదలవ్వకముందే విన్నాను. కథ వినగానే నచ్చేసింది. వెంటనే సినిమాని చేస్తానని దర్శకుడితో చెప్పా అన్నారు. మంచి ఫన్, ఎంటర్ టైమెంట్, ఫ్యామిలీ, మాస్..ఇలా అందరికీ కావాల్సిన ఎలిమెంట్స్ నా సినిమాలో వున్నాయి. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ తమ ఫ్యామిలీతో రిలేట్ చేసుకుంటున్నారు. ‘కృష్ణ వ్రింద విహారి’ ఎవర్ గ్రీన్ కథ. కుటుంబం ఉన్నంతవరకూ ఇలాంటి కథలకు తిరుగులేదు అన్నారు శౌర్య.
అలాగే నా కెరీర్ లో ఇంత టెన్షన్ ఎప్పుడూ పడలేదు. ప్రమోషన్స్ లో భాగంగాచేసిన పాదయాత్రలో ప్రేక్షకుల అభిమానం చూస్తే నిజంగా ఒక వరం అనిపించింది. పాదయాత్రలో చాలా నేర్చుకున్నాను అన్నారు. ఇక అదుర్స్ , డిజే, అంటే సుందరానికీ,.. ఇలా ఎన్నో సినిమాల్లో బ్రాహ్మణ పాత్ర వున్నమాత్రాన పాత్రలు, కథలు ఒకటి కాదు. దేనికదే భిన్నమైనది. ‘కృష్ణ వ్రింద విహారి’ కూడా భిన్నమైన కథ. నాతొ పాటు ఇందులో వున్న అందరి పాత్రలో వినోదం వుంటుంది. రాధిక గారి పాత్ర తప్పితే మిగతా పాత్రలన్నీ హిలేరియస్ గా వుంటాయి. అనీష్ మంచి కామెడీ టైమింగ్ వున్న దర్శకుడు. ఇందులో సెకండ్ హాఫ్ నాకు చాలా నచ్చింది. అలాగే రాధిక గారు పాత్ర ఇందులో చాలా కీలకం. రాధిక గారితో నటించడం గొప్ప అనుభవం. రాధిక గారు బిజీగా వుండి ప్రమోషన్స్ కి రాలేకపోయారు. సక్సెస్ మీట్ కి వస్తారని భావిస్తున్నాను.నిజంగా రొమాంటిక్ కామెడీలు చేసినప్పుడు అంత సౌకర్యంగా ఫీలవ్వను. రొమాంటిక్ సీన్స్ లో నేను చాలా వీక్. నందిని రెడ్డిగారిని అడిగినా ఇదే చెప్తారు. మా దర్శకుడు చాలా కష్టపడి జాగ్రత్తగా ఇందులో చేయించారు అంటూ చెప్పుకొచ్చాడు నాగశౌర్య.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..