Bigg Boss 6 Telugu: రసవత్తరంగా మారిన బిగ్ బాస్.. ఈసారి జైలుపాలైంది ఎవరంటే

బిగ్ బాస్ సీజన్ 6 మంచి రసవత్తరంగా సాగుతోంది. హౌస్ లో ఉన్న వారు ఒకరిమీద ఒక రివ్యూలు ఇచ్చుకుంటూ గొడవలు పడుతూ..నానా హంగామా చేస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ మూడో వారంలోకి ఎంటర్ అయ్యింది.

Bigg Boss 6 Telugu: రసవత్తరంగా మారిన బిగ్ బాస్.. ఈసారి జైలుపాలైంది ఎవరంటే
Bigg Boss 6
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 24, 2022 | 11:25 AM

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ 6 మంచి రసవత్తరంగా సాగుతోంది. హౌస్ లో ఉన్న వారు ఒకరిమీద ఒక రివ్యూలు ఇచ్చుకుంటూ గొడవలు పడుతూ..నానా హంగామా చేస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ మూడో వారంలోకి ఎంటర్ అయ్యింది. ఈ వారం ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారని ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక హౌస్ లో ఉన్నవారిలో గీతూ చేస్తున్నంత రచ్చ ఇంకెవ్వరూ చేయడం లేదు. నేను ఇంతే ఉంటా అంటూ హౌస్ లో నానా యాగీ చేస్తుంది గీతూ.. ప్రతి చిన్నదానికి పక్కవారితో గొడవలు పెట్టుకుంటూ రచ్చ రచ్చ చేస్తోంది. తనది కానీ దాంట్లో కూడా దూరుతూ విమర్శలపాలు అవుతోంది. ఇక హౌస్ లో ఉన్నవారిలో దాదాపు అందరితో గొడవలు పెట్టుకుంది ఈమె. ముఖ్యంగా ఇనాయ, రేవంత్ లతో ఇక నిన్నటి ఎపిసోడ్ లో కూడా గీతూకి రేవంత్ కు మధ్య చిన్న వార్ జరిగింది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నవారికి ఓ చిన్న టాస్క్ ఇచ్చాడు.

ఈ యాక్టివిటీ పేరు నేను ఎంతలా కనిపిస్తున్నాను. హౌస్ లో ఉన్నవాళ్లు వాళ్ల గురించి ఏమనుకుంటున్నారు ప్రేక్షకులను ఎన్ని నిముషాలు ఫుటేజ్ ఇచ్చారో మార్కులు వేసుకోవాలని అన్నారు. దానిలో భాగంగా ఒకొక్కరు వారికీ వారు మార్కులు ఇచ్చుకున్నారు. అయితే ఈ టాస్క్ లో గీతూ నేను 10 నిముషాలు కనిపిస్తా అంటూ పదినిమిషాల చైన్ ను మేడలో వేసుకుంది. ఆ తర్వాత రేవంత్ 7 నిముషాలు, ఫైమా 6 నిముషాలు, ఇనాయ, శ్రీహాన్ 5 నిమిషాల చైన్స్ వేసుకున్నారు. అయితే ఈ క్రమంలో గీతూ మాట్లాడుతూ.. రేవంత్ ఎక్కువగా పడుకొనే ఉంటున్నాడు అంటూ మొదలు పెట్టింద. దానికి రేవంత్ కూడా గట్టిగానే ఇచ్చాడు. నేనేంటో నాకు తెలుసు, చూస్తున్న ఆడియన్స్ కు తెలుసు.. ఎవరు ఎక్కువ కనిపిస్తున్నారో నాగ్ సార్ వచ్చి చెప్తారు. నన్ను ఎంత తొక్కాలని చూసిన నేను పైకి లేస్తాను.. ఓటమిని నేను ఒప్పుకోనూ అంటూ గీతూకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. ఇక జీరో కంటెంట్ ఇస్తున్న హౌస్ మేట్స్ లో ఆరోహి, అర్జున్ కళ్యాణ్, కీర్తి ఉన్నారు. వీరిలో ఒకరు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది అనగా.. అర్జున్ కళ్యాణ్  తనంతట తనే జైలుకు వెళ్ళాడు.. ఇక కీర్తి ఎక్కీఎక్కి ఏడ్చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..