ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి.. హీరోయిన్ మాత్రమే కాదు..ఫెమినా మిస్ ఇండియా కూడా.. ఎవరో గుర్తుపట్టారా..?
తెలుగు తెరపై కొత్త అందాలు ప్రేక్షకులను మైమరపిస్తున్నాయి. కేవలం అందంతోనే కాదు అభినయంతోనూ ఆకట్టుకుంటున్నారు కొంతమంది ముద్దుగుమ్మలు ఆ ముద్దుగుమ్మల్లో ఈ వయ్యారి భామ కూడా ఒకరు.
తెలుగు తెరపై కొత్త అందాలు ప్రేక్షకులను మైమరపిస్తున్నాయి. కేవలం అందంతోనే కాదు అభినయంతోనూ ఆకట్టుకుంటున్నారు కొంతమంది ముద్దుగుమ్మలు ఆ ముద్దుగుమ్మల్లో ఈ వయ్యారి భామ కూడా ఒకరు. పైన కనిపిస్తున్న ఫొటోలో ఉన్న చిన్నారి. ఇప్పుడు టాలీవుడ్ లో గ్లామరస్ హీరోయిన్ లలో ఒకరు ఇంతకు ఎవరో గుర్తుపట్టారా.. ఈ అమ్మడు ఫెమినా మిస్ ఇండియాగా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్నరప్‌గా కూడా నిలిచింది. గుర్తుపట్టడం అంత కష్టం కాకపోవచ్చు.. ఇంకా మీకు క్లూ కావాలంటే మాస్ మహారాజ రవితేజ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ భామ. ఇంతకు చిన్నారి ఎవరంటే..
పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరో కాదు.. గ్లామరస్ హీరోయిన్ మీనాక్షి చౌదరి. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ 2018లో ఫెమినా మిస్ ఇండియాగా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచి 2021లో విడుదలైన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో హీరోయిన్గా తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆశించిన స్థాయిలో ఈ చిత్రం మెప్పించకపోయిన ఈ ముద్దుగుమ్మ అందానికి, అభినయానికి మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ఖిలాడి మూవీ లో రవితేజ సరసన హీరోయిన్ గా నటించింది . ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రేక్షకులను అలరించ లేకపోయినప్పటికీ ఈ మూవీ లో మీనాక్షి చౌదరి మాత్రం తన హాట్ హాట్ అందాలతో కుర్రకారును హీటెక్కించింది . ప్రస్తుతం ఈమె వరుస అవకాశాలతో దూసుకెళ్తుంది. ఇప్పటికే ఈమె నటించిన హిట్-2 చిత్రం రిలీజ్ కి రెడీగా ఉంది. నేచరల్ స్టార్ నాని ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహారించారు. అలానే ఈమె తమిళ్ లో కూడా బాగానే రాణిస్తుంది. ప్రస్తుతం “కొలై” అని చిత్రం తమిళ్ లో రిలీజ్ కు రెడీ గా ఉంది. అలానే తమిళ్ మరో కొత్త చిత్రం చేసేందుకు కూడా ఈ ముద్దుగుమ్మ రెడీ అవుతుంది.