కరెక్ట్ టైంలో వస్తున్న క్లాసిక్ లవ్ స్టోరీ.. నాగచైతన్య, సాయి పల్లవి మూవీ రీరిలీజ్ ఎప్పుడంటే
నాగ చైతన్య, సాయి పల్లవి, శేఖర్ కమ్ముల, SVCLLP, అమిగోస్ క్రియేషన్స్ ఆల్-టైమ్ క్లాసిక్ రొమాంటిక్ మూవీ లవ్ స్టోరీ. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి పోటీపడి నటించారు. ఇక ఇప్పుడు ఈ సినిమా మరోసారి థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అవుతుంది.

అక్కినేని అందగాడు నాగ చైతన్య కెరీర్‌లో మరపురాని మైల్ స్టోన్ మూవీస్ లో లవ్ స్టోరీ సినిమా ఒకటి. ఈ చిత్రంలో నాగ చైతన్య తెలంగాణ గ్రామానికి చెందిన డాన్సర్‌గా పూర్తిగా కొత్త పాత్రలో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. అలాగే తెలంగాణ యాసలో అదరగొట్టాడు. దర్శకుడు శేఖర్ కమ్ముల చైని అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ఈ చిత్రంలో చై తన నటనలోని భావోద్వేగాల అందరినీ హత్తుకున్నాయి. ఆయన నటనకు విమర్శకులు, ప్రేక్షకులు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపించారు. హీరోయిన్ గా సాయి పల్లవి అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు.
చైతన్య–సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ, కుల, వర్గ భేదాలను దాటిన ప్రేమ కథను మరింత హృదయాన్ని తాకేలా చేసింది. గ్రామీణ తెలంగాణ జీవనశైలిని అద్భుతంగా, సున్నితంగా తెరపై ఆవిష్కరించారు దర్శకుడు శేఖర్ కమ్ముల. సంగీత దర్శకుడు పవన్ అందించిన అందించిన “నీ చిత్రమ్ చూసి, సారంగ దరియా” పాటలు సినిమా విడుదలకు ముందే చార్ట్‌బస్టర్స్‌గా మారాయి. ఇప్పటికీ అన్ని ప్రముఖ మ్యూజిక్ ప్లాట్‌ఫార్మ్‌లలో ట్రెండ్ అవుతున్నాయి.
ఇప్పుడు, మేకర్స్ ఈ ఆల్ టైమ్ క్లాసిక్ రొమాంటిక్ సాగా ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రీరిలీజ్ చేస్తున్నారు. కోవిడ్ సమయంలో 2021లో విడుదలైన ఈ చిత్రం సవాళ్లను దాటుకొని బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. SVCLLP, అమిగోస్ క్రియేషన్ బ్యానర్లపై నిర్మాతలు నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని ఒక ప్రేమకావ్యంగా తీర్చిదిద్దారు. ఇక ఇప్పుడు వాలెంటైన్స్ డే రోజున లవ్ స్టొరీ సినిమా మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది. చైతన్య–సాయి పల్లవి అభిమానులు సినీ ప్రేమికులు ఈ ఆల్-టైమ్ క్లాసిక్ ని మరోసారి బిగ్ స్క్రీన్ పై ఎంజాయ్ చేయడానికి రెడీ అవుతున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




