Naga Chaitanya : విడాకుల పై మరోసారి స్పందించిన నాగ చైతన్య.. ఏమన్నాడంటే
మొన్నటిదాకా చెట్టాపట్టాలేసుకొని అంన్యున్యంగా తిరిగిన లవబుల్ జంట సమంత, నాగచైతన్య విడిపోవడాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారు
Naga Chaitanya : మొన్నటిదాకా చెట్టాపట్టాలేసుకొని అంన్యున్యంగా తిరిగిన లవబుల్ జంట సమంత, నాగచైతన్య విడిపోవడాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ ఇద్దరు తిరిగి కలిస్తే బాగుండు అని అంతా అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు అటు సమంత కానీ అటు నాగచైతన్య కానీ ఈ విషయం పై పబ్లిక్ గా ప్రస్తావించలేదు. రీసెంట్ గా నాగచైతన్య విడాకుల పై స్పందిస్తూ.. తాను హ్యాపీగా ఉంది నేను హ్యాపీగా ఉన్నా అంటూ చెప్పుకొచ్చాడు. తాజాగా మరోసారి నాగచైతన్య విడాకుల పై స్పందించాడు. నాగ చైతన్య వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో హిట్స్ అందుకున్నాడు చైతన్య. ఇక ఇప్పుడు బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నాడు. అమీర్ ఖాన్ నటిస్తున్న లాల్ సింగ్ చద్దా సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు చైతన్య. ఈ క్రమంలో బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంట్రవ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నడు చైతన్య.
ఈ క్రమంలోనే విడాకుల పై స్పందించాడు. నా గురించి ఎవరు ఏమి రాసినా నాకు పర్వాలేదు.. కానీ నా కుటుంబం గురించి రాస్తే నేను బాధపడతాను అని అన్నాడు. విషయాన్నీ మిస్ లీడ్ చేయనంతవరకు నేను స్పందించను అన్నాడు చైతన్య.. నాన్న (నాగార్జున) చెప్పినట్లే కుటుంబ సంబంధమైన, వ్యక్తిగతమైన వాటిని సరిదిద్దుకోవాలి తప్ప సరిదిద్దుకోలేకపోతే పర్వాలేదు రియాక్ట్ అవ్వకండి అని చెప్పారు అన్నాడు. పండ్లు ఉన్న చెట్టుకు రాళ్లనే విషయాన్ని బలంగా నమ్ముతాను. అందుకే నా గురించి జరిగే ప్రచారాలపై స్పందించను. కానీ నా కుటుంబం గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, నన్ను ఎంతో బాధించింది అని నాగచైతన్య చెప్పుకొచ్చాడు.
మరిన్ని ఇక్కడ చదవండి :