Radhe Shyam: ప్రభాస్- పూజ హెగ్డే లేకుండా రొమాంటిక్ సాంగ్ తీసారట.. ఎలా అనుకుంటున్నారా..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ప్రభాస్ సినిమా కోసం ఆయన అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు

Radhe Shyam: ప్రభాస్- పూజ హెగ్డే లేకుండా రొమాంటిక్ సాంగ్ తీసారట.. ఎలా అనుకుంటున్నారా..?
Prabhas
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 22, 2022 | 4:53 PM

Radhe Shyam: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ప్రభాస్ సినిమా కోసం ఆయన అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో చేసిన రాధేశ్యామ్ సినిమా రిలీజ్ కు రెడీ గా ఉంది. ఈ సినిమా పిరియాడిలా డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ కు జోడీగా పూజాహెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా రిలీజ్ కోసం ప్రభాస్ అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు టీజర్, ట్రైలర్ సినిమా పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఈ సినిమా అంతా విదేశాల్లో తెరకెక్కిన విషయం ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుద‌ల కావాల్సి ఉండ‌గా క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే.

ఆర్ఆర్ఆర్ వాయిదా ప‌డిన త‌ర్వాత రాధేశ్యామ్ విడుద‌ల‌ను వాయిదా వేయ‌మ‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించిన‌ప్పటికీ.. చివ‌రి క్ష‌ణంలో తాము కూడా చిత్రాన్ని ప్రేక్ష‌కుల‌కు ముందుకు తీసురాలేక‌పోతున్నామ‌ని ప్ర‌క‌టించారు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ నిరాశ‌కు గుర‌య్యారు. త్వరలోనే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు. ఈ సినిమాలో ఓ రొమాంటిక్ సాంగ్ సినిమాకు హైలైట్ గా నిలవనుందట. అయితే ఈ పాటను ప్రభాస్ , పూజ హెగ్డే లేకుండా తెరకెక్కించారట. సాంగ్ షూటింగ్ టైమ్ కి పూజ వేరే సినిమాలతో బిజీ అయిపోయిందట. డేట్స్ సర్దుబాటు చేసే పరిస్థితి కూడా లేకపోయింది. దాంతో దర్శక నిర్మాతలు గ్రాఫిక్స్ తోనే ఆ పాటను చేద్దామని ఫిక్స్ అయ్యారట. అలా ప్రభాస్ – పూజ ఇద్దరూ అవసరం లేకుండానే పూర్తిస్థాయి గ్రాఫిక్స్ తో ఒక పాటను రెడీ చేశారట.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Photo: బూరెబుగ్గల బుజ్జాయి.. చిరునవ్వులతో కట్టిపడేస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.?

Nagashaurya: కృష్ణ వ్రింద విహారి అంటోన్న నాగశౌర్య.. బర్త్ డే వేళ స్పెషల్ సర్‏ప్రైజ్..

Manchu Lakshmi: తెలంగాణ ప్రభుత్వానికి మంచు లక్ష్మీ రిక్వెస్ట్.. ఎందుకంటే..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో