AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: 8 సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్! ప్రేక్షకులకు పండగే..

పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో ప్రస్తుతం యమ బిజీగా ఉన్నాడు. గత ఆరేళ్లలో కేవలం 3 సినిమాలు మాత్రమే చేసినా, మరీ ఇంత లాంగ్ గ్యాప్ తీసుకునే ఉద్ధేశ్యం ఇకపై ఉన్నట్లు కనిపించడం లేదు.

Prabhas: 8 సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్! ప్రేక్షకులకు పండగే..
Prabhas
Srilakshmi C
|

Updated on: Jan 22, 2022 | 4:48 PM

Share

Pan India Star Prabhas Upcoming Movies: పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో ప్రస్తుతం యమ బిజీగా ఉన్నాడు. గత ఆరేళ్లలో కేవలం 3 సినిమాలు మాత్రమే చేసినా, మరీ ఇంత లాంగ్ గ్యాప్ తీసుకునే ఉద్ధేశ్యం ఇకపై ఉన్నట్లు కనిపించడం లేదు. ఇప్పటికే వరుస పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నడార్లింగ్, ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ వంటి భారీ ప్రాజెక్టులతో పనిచేస్తున్నాడు. వీటిల్లో ఇప్పటికే కొన్ని చిత్రాలు పూర్తి కాగా, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ మరో మూడు సినిమాలకు కూడా గ్నీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాధే శ్యామ్ నటుడు, ’యుద్ధం‘ దర్శకుడు సిద్ధార్థ ఆనంద్‌తో మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై ఓ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కోసం పనిచేయనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. దీనితోపాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో కూడా ప్రభాస్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు టాలీవుడ్ టాక్. ఈ రెండు చిత్రాలతోపాటు ’రాజా డీలక్స్‘ అనే టైటిల్‌తో డివివి దానయ్య, నిరంజన్ రెడ్డి నిర్మాతలుగా భారీ చిత్రాల మధ్య వచ్చే గ్యాప్‌లో త్వరితగతిన మరో సినిమా చిత్రీకరించేందుకు డార్లింగ్ ఓకే చెప్పినట్లు సమాచారం. ఇదంతా చూస్తుంటే మొత్తంగా 8 చిత్రాలతో ప్రభాస్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది

ఇక ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యామ్‌ విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం జనవరి 14న విడుదల కావల్సి ఉండగా కోవిడ్-19 వేవ్ కారణంగా వాయిదా పడింది. మార్చి/ఏప్రిల్ విడుదలకు సన్నాహాలు చేస్తోంది. ఆ తర్వాత సాలార్, ఆదిపురుష్ చిత్రాలు విడుదలయ్యే అవకాశం ఉంది.

Also Read:

Crime News: ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు అరెస్ట్! బాటసారులను అడవిలోకి లాక్కెళ్లి..