Thank You: అక్కినేని కుర్ర హీరో నాగచైతన్య నయా మూవీ థాంక్యూ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్…

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ఆచితూచి కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇటీవలే శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లవ్ స్టోరీ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

Thank You: అక్కినేని కుర్ర హీరో నాగచైతన్య నయా మూవీ థాంక్యూ  రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్...
Thank You
Follow us
Rajeev Rayala

|

Updated on: May 14, 2022 | 3:06 PM

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య(Naga Chaitanya) ఆచితూచి కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇటీవలే శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లవ్ స్టోరీ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పల్లెటూరి కుర్రాడిగా అలరించిన చైతు తన నటనతో మరో మెట్టు పైకెక్కాడు. ఇక ఇప్పుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అక్కినేని ఫ్యామిలీకి మనం లాంటి మెమరబుల్ హిట్ ఇచ్చిన విక్రమ్ ఇప్పుడు చైతన్య కోసం ఓ అదిరిపోయే కథను సిద్ధం చేశాడని తెలుస్తుంది. ఈ సినిమాకు థాంక్యూ (Thank You) అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను అనౌన్స్ ఖరారు చేశారు మేకర్స్. ఇటీవలే షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమా లో చైతన్య హాకీ ప్లేయర్ గా కనిపించనున్నాడని చాలా రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అలాగే ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు వీరాభిమానిగా కనిపించనున్నాడట చైతూ..

తాజాగా ఈ సినిమానుంచి అదిరిపోయే అప్డేట్ ను ఇచ్చింది చిత్రయూనిట్. ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు చిత్రయూనిట్. జులై 7వ తేదీన చిత్రాన్ని థియేటర్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. దాంతో పాటు అదిరిపోయే పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. చైనత్య కొత్త పోస్టర్ లో లుక్ ఆకట్టుకుంటుంది. ఈమూవీలో నాగచైతన్యకి జోడీగా అందాల భామ రాశీఖన్నా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ థాంక్యూ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి
Naga Chaithanya

మరిన్ని ఇక్కడ చదవండి : 

Keerthy Suresh: కళావతి అందాలకు కల్లోలం అవుతున్న కుర్రకారు

Rukshar Dhillon: పాలరాతి శిల్పం లా మెరిసిపోతున్న రుక్సర్‌ ధిల్లాన్‌.. లేటెస్ట్ పిక్స్ వైరల్

Bhanu Shree: భాను శ్రీ కొంటె చూపాలకు కుర్రకారు ఫిదా అవ్వాల్సిందే