Naga Chaitanya: కస్టడీలో నాగచైతన్య.. ఫుల్ యాక్షన్తో రాబోతున్న అక్కినేని యువసామ్రాట్..
మంగళవారం మేకర్స్ స్టన్నింగ్ ప్రీ లుక్ తో అభిమానులను, సినీ ప్రేమికులను సర్ ప్రైజ్ చేశారు. ప్రీ-లుక్ లో నాగ చైతన్య పోలీస్ అవతార్ లో ఫెరోషియస్ లుక్ లో కనిపించారు. తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్ లో తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం రెండు నెలల క్రితమే సెట్స్ పైకి వెళ్లింది. NC22 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. బంగర్రాజు సినిమా తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న మూవీ ఇది. చైతూ కెరీర్ లో అత్యంత భారీ చిత్రాల్లో NC 22 ప్రాజెక్ట్ ఒకటి. తారాగణం, అద్భుతమైనసాంకేతిక విభాగం ప్రకటనతో ఈ చిత్రం భారీ బజ్ను క్రియేట్ చేసింది. ఇక మంగళవారం మేకర్స్ స్టన్నింగ్ ప్రీ లుక్ తో అభిమానులను, సినీ ప్రేమికులను సర్ ప్రైజ్ చేశారు. ప్రీ-లుక్ లో నాగ చైతన్య పోలీస్ అవతార్ లో ఫెరోషియస్ లుక్ లో కనిపించారు. తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
ఈ సినిమాకు కస్టడీ అనే పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. నవంబర్ 23న నాగచైతన్య బర్త్ డే సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ కస్టడీ టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో చైతూ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తుండగా.. తోటి అధికారుల చేతుల్లో లాక్ చేయబడినట్లు కనిపిస్తున్నాడు. అతని ఆవేశాన్ని అదుపు చేయడానికి తుపాకీలను కూడా గురిపెట్టడం గమనించవచ్చు. మీరు ప్రపంచంలో చూడాలనుకునే మార్పు మీరే అయి ఉండాలి అంటూ ప్రస్తావించారు. ఇక తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే.. అక్కినేని ప్యాన్స్ కోరుకునే మాస్ అండ్ యాక్షన్ అంశాలన్నీ ఈ సినిమాలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దిగ్గజ తండ్రీకొడుకులు సంగీత ద్వయం ఇసైజ్ఞాని ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని పవన్ కుమార్ సమర్పించనున్నారు. అబ్బూరి రవి డైలాగ్స్ రాస్తుండగా, ఎస్ఆర్ కతిర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాలో తమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్.. నటి ప్రియమణి కీలక పాత్రలలు పోషిస్తున్నారు. ఇందులో కార్తీక దీపం ఫేమ్ వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్ ముఖ్యపాత్రలో కనిపించనుంది.
Our Beloved @chay_akkineni‘s B’Day Celebrations on!!?
Here we GO, the RAGING First Look & Title of #NC22 ?#??????? – A @vp_offl HUNT❤️?#CustodyFL @IamKrithiShetty @thearvindswami @ilaiyaraaja @thisisysr @SS_Screens @srinivasaaoffl @realsarathkumar #Priyamani #VP11 pic.twitter.com/1p6PqzPbe7
— Srinivasaa Silver Screen (@SS_Screens) November 23, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.