Naga Chaitanya: నా భార్య ముందు నా పరువు పోతుంది.. ఫ్యాన్స్‌ను రిక్వెస్ట్ చేసిన నాగ చైతన్య
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య విభిన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. కెరీర్ బిగినింగ్ లో లవర్ బాయ్ గా మెప్పించిన నాగ చైతన్య.. ఇప్పుడు మాస్ హీరోగా మరి సినిమాలు చేస్తున్నారు. వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ పేక్షకులను అలరిస్తున్నాడు ఈ అక్కినేని అందగాడు. చైతూ కెరీర్ లో ఎన్నో మంచి హిట్స్ ఉన్నాయి.
![Naga Chaitanya: నా భార్య ముందు నా పరువు పోతుంది.. ఫ్యాన్స్‌ను రిక్వెస్ట్ చేసిన నాగ చైతన్య](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/naga-chaitanya-2.jpg?w=1280)
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్. ఈ సినిమా పై ఇప్పుడు మంచి అంచనాలున్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా బాగా చేస్తుందన్న కామెంట్సు ఉన్నాయి. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు కార్తీకేయ 2 ఫేమ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. కొన్ని నెలలుగా షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7న అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. దీంతో ఈ సినిమా నుంచి పోస్టర్స్, సాంగ్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తున్నారు మేకర్స్.
తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఏ మాయ చేశావే సినిమా దగ్గర నుంచి శేఖర్ కమ్ముల దర్శకతంలో వచ్చిన లవ్ స్టోరీ వరకు తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు చైతన్య. ఇక ఇప్పుడు తండేల్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడు. ఈ సినిమా అందమైన ప్రేమకథగా తెరకెక్కనుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. అలాగే ఈ సినిమాతో నాగ చైతన్య మరోసారి తన నటనతో ఆకట్టుకోనున్నాడు.
దేవీ శ్రీ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే తాజగా తండేల్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో నాగ చైతన్య చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. వైజాగ్ లో తండేల్ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ఈవెంట్ లో నాగచైతన్య మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా తండేల్ ఉంటుందని చైతూ అన్నారు. అలాగే ఈ సినిమాకు చాలా కష్టపడ్డాను. నా పాత్ర ప్రతిఒక్కరికి కనెక్ట్ అవుతుంది అని అన్నారు. అలాగే చైతూ మాట్లాడుతూ.. వైజాగ్ అమ్మాయి శోభితని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నా ఇంట్లో రూలింగ్ పార్టీ వైజాగ్. వైజాగ్ లో ఈ సినిమాకి వసూళ్లు రావాలి. లేకపోతే నా ఇంట్లో పరువు పోతుందని నాగచైతన్య సరదాగా ఫ్యాన్స్‌ని ఉద్దేశించి అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా ఈ సినిమాలో చైతూ మొదటిసారి మత్యకారుడిగా కనిపించనున్నాడు. నిజజీవిత సంఘటన ఆధారంగా ఈ సినిమాలు తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు చందు మొండేటి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.