Kuberaa Movie: బడిలో చెప్పని పాఠం ఇది రా.. మనసును హత్తుకునేలా కుబేర మూవీ సాంగ్.. విన్నారా.. ?
టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ సినిమా కుబేర. డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో కోలీవుడ్ హీరో ధనుష్, నాగార్జున కీలకపాత్రలు పోషిస్తుండగా.. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది.

డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమాల గురించి చెప్పక్కర్లేదు. తెలుగు సినీరంగంలో కంటెంట్ కు విలువనిచ్చే దర్శకులలో ఆయన ఒకరు. కమర్షియల్ హంగులకు తావులేకుండా హృదయాలను హత్తుకునే కథలను.. హృద్యమైన ఎమోషన్లతో రూపొందించడంలో శేఖర్ కమ్ముల ముందుంటారు. అందమైన కథను మరింత అద్భుతంగా తెరపై ఆవిష్కరిస్తుంటారు. విభిన్నమైన కంటెంట్ కథలతో సినీప్రియులను ఆకట్టుకుంటారు. 2004లో ఆనంద్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆయన .. ఆ తర్వాత గోదావరి, హ్యాపీడేస్, లీడర్, ఫిదా, లవ్ స్టోరీ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ఆయన.. ఇప్పుడు కుబేర సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో కోలీవుడ్ హీరో ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇదివరకు విడుదలైన టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. జూన్ 20న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. దీంతో కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి బడిలో చెప్పని పాఠం ఇది సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్.
కుబేర చిత్రంలోని “బడిలో చెప్పని పాఠం ఇది రా.. బతికే నేర్చుకో నా కొడుకా” అంటూ సాగే పాట లిరికల్ వీడియోను చిత్రయూనిట్ బుధవారం విడుదల చేసింది. నందకిశోర్ సాహిత్యం అందించిన ఈ పాటను సింధూరి విశాల్ ఆలపించారు. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. తాజాగా విడుదలైన ఈ సాంగ్ లిరిక్స్ తోపాటు..దేవి శ్రీ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ హత్తుకుంటుంది. ఈ సినిమాను జూన్ 20న తెలుగుతోపాటు తమిళం భాషలలోనూ రిలీజ్ చేయనున్నారు.
ఇదిలా ఉంటే.. తమిళంలో వరుస సినిమాలతో స్టార్ స్టేటస్ అందుకున్న ధనుష్.. సార్ సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఇప్పుడు కుబేర సినిమాతో మరోసారి తెలుగు అడియన్స్ ముందుకు రాబోతున్నారు. ధనుష్ ఇప్పుడు తెలుగుతోపాటు హిందీలోనూ వరుస సినిమాల్లో నటిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..
సీరియల్లో పద్దతిగా.. వెకేషన్లో గ్లామర్‌గా.. రుద్రాణి అత్త అరాచకమే..
త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..
Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..




