Thaman: మహేష్ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన థమన్.. సర్కారు వారి పాట ట్యూన్ వినిపించేశాడుగా..
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తున్న

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ప్రతి పోస్టర్ సర్కారు వారి పాట పై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇందులో మహేష్ సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాపై ఇప్పుడు కరోనా ప్రభావం ఎక్కువగానే చూపిస్తుంది. ఇటీవల మహేష్ బాబు మోకాలి సర్జరీ జరగడం.. ఆ తర్వాత.. మహేష్.. కీర్తి సురేష్ కరోనా బారిన పడడంతో ఈ మూవీ షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇక అటు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఆగిపోయాయి. అయితే ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఈ మూవీ వేసవికి వాయిదా పడింది.
ఇదిలా ఉంటే.. సర్కారు వారి పాట నుంచి అప్డేట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా సినిమాకు సంబంధించిన అప్డేట్ వస్తుందేమో అని ఎదురుచూశారు. చివరకు మరోసారి వారికి నిరాశే ఎదురయ్యింది. ఇదిలా ఉంటే.. తాజాగా థమన్ ఓ వీడియోను విడుదల చేశాడు. ఇందులో మహేష్ అభిమానులకు కావాల్సిన స్టఫ్ ఇచ్చాడు. సర్కారు వారి పాట టైటిల్ సాంగ్ ట్యూన్‌ను అలా ప్లే చేసి వినిపించాడు. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి జరగాల్సిన మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రతిసారి వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే.
ట్వీట్..
And We Started it for Our S⭐️?? pic.twitter.com/Ihnlc0MHMD
— thaman S (@MusicThaman) January 22, 2022
Also Read: Priyamani: సెకండ్ ఇన్నింగ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ‘ప్రియమణి’ ఆకట్టుకుంటున్న ఫొటోస్…
Harish Shankar : ‘అబ్బా చింపేశావ్ అన్నయ్యా.. నిజానికి పిండేశావ్’.. హరీష్ శంకర్ ఆసక్తికర ట్వీట్




