Thaman : కళ్ళల్లో నీళ్లొచ్చాయి.. గుండె తడిసిపోయింది..! ఎమోషనల్ వీడియో షేర్ చేసిన తమన్
ప్రస్తుతం ఇండస్ట్రీలో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు తమన్ . సినిమా ఏదైనా సరే తమన్ తన సంగీతంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇక మాస్ సినిమాలకు తమన్ అందించే సంగీతానికి సపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంది. ముఖ్యంగా బాలకృష్ణ సినిమాలకు తమన్ ఓ రేంజ్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తారు.

సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన సంగీతంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు. సినిమా సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ అందిస్తూ దూసుకుపోతున్నాడు. అలాగే పాన్ ఇండియా రేంజ్ లో హిట్స్ అందుకుంటున్నాడు తమన్. ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో యమా బిజీగా ఉన్నాడు. వైవిధ్యమైన మ్యూజిక్ అందిస్తూ.. కొత్త కొత్త సింగర్స్ ను పరిచయం చేస్తున్నారు తమన్. ప్రస్తుతం ఓజీ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు తమన్. ఇక సోషల్ మీడియాలోనూ తమన్ చాలా యాక్టివ్ గా ఉన్నాడు. రెగ్యులర్ గా తన సినిమా అప్డేట్స్ ఇస్తూ అభిమానులకు కిక్ ఇస్తుంటారు తమన్. ఇదిలా ఉంటే తాజాగా తమన్ షేర్ చేసిన వీడియో ఇప్పుడు అందరిని ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది.
ఒంటరిగా చూస్తే వణుకు పుట్టి చస్తాం.. సీన్ సీన్‌కు సుస్సు పడాల్సిందే
తమన్ షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. “కళ్లల్లో నీళ్లు తిరిగాయి.. మనసంతా సంతోషంతో నిండిపోయింది.. ఇదే ఆనందమంటే” అంటూ ఓ ట్వీట్ చేశారు తమన్. అంతలా ఈ ట్వీట్ లో ఏముందంటే.. ఈ వీడియోలో ఓ పెద్దాయన హైవే పక్కన కూర్చొని జండా ఊపుతూ కనిపించాడు. ఓ హోటల్ ముందు కూర్చొని జండా ఊపుతూ.. ఆ హోటల్ కు వచ్చి భోజనం చేయండి అంటూ చెప్తున్నాడు.
నా వల్ల అందరికి లాభం వచ్చింది.. నాకు మాత్రం రూపాయి కూడా ఇవ్వలేదు: హీరోయిన్
అంత మండుటెండలో కాళ్లకు చెప్పులు లేకుండా.. అంత కష్టపడుతున్న ఆ పెద్దయనను చూసి అటుగా కారులో వెళ్తున్న ఓ కుర్రాడు మానవత్వం చాటుకున్నాడు. ఇంత ఎండలో కాళ్లకు చెప్పులేకుండా.. కనీసం గొడుకు కూడా లేకుండా ఉన్నావ్ ఏంటి అని అడగ్గా..? ఏం చేయమంటావ్ బాబు.. హోటల్ వాళ్లు గొడుగు కొంటాం అని అన్నారు.. చెప్పులు అయితే రాత్రి కుక్కలు కొరికేశాయ్ అని తెలిపాడు. దాంతో చలించిపోయిన ఆ కుర్రాడు.. ఓ గొడుగు, చెప్పులతో పాటు ఓ జ్యూస్ బాటిల్ కూడా కొనుకొచ్చి ఇచ్చాడు. ఆ కుర్రాడు చూపించిన దయకు చాలా కృతజ్ఞతలు బాబూ అంటూ ఆ కుర్రాడి చేతిని ముద్దాడాడు ఆ పెద్దాయన. ఈ వీడియోను తమన్ షేర్ చేశారు.
ఇదెక్కడి సినిమా రా మావ.. సీన్ సీన్‌కు ఊహించని ట్విస్ట్‌లు.. అలాగే అంతకు మించి..
Eyes Filled With Tears 🥹 Heart is filled With Joy
This Is happiness 🫶 pic.twitter.com/enWujXISIO
— thaman S (@MusicThaman) March 9, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.