Suriya : సూర్య సినిమాలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఈ కాంబో అదిరిపోతుంది గురూ..
కోలీవుడ్ క్రేజీ హీరో సూర్య ఇప్పుడు ఫుల్ జోష్ మీదున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన నటించిన రెట్రో మూవీ మే1న థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు తమిళంతోపాటు తెలుగులోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇప్పుడు సూర్య తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై ఫోకస్ చేశారు.

తమిళ్ హీరో సూర్య ఖాతాలో మరో హిట్టు పడింది. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఆయన నటించిన రెట్రో సినిమా మే1న విడుదలైన సంగతి తెలిసిందే. మొదటి రోజే ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ సినిమా పాజిటివ్ రివ్యూస్ అందుకుంది. ఈ సినిమాలో సూర్య సరసన టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే కథానాయికగా నటించింది. ఇక ఈ సినిమా తర్వాత సూర్య ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం సూర్య తన తదుపరి సినిమాను డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేయనున్నారట. వెంకీ అట్లూరి చివరగా లక్కీ భాస్కర్ సినిమాతో హిట్ అందుకున్నారు. ఇందులో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా నటించారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31, 2024న థియేటర్లలో విడుదలై భారీ వసూళ్లు రాబట్టింది.
ఇక ఇప్పుడు వెంకీ అట్లూరి, సూర్య కాంబోలో ఓ ప్రాజెక్ట్ రాబోతుంది. దీంతో ఈ సినిమాపై ఇప్పటికే మంచి క్యూరియాసిటి నెలకొంది. వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఇటీవల హైదరాబాద్ లో జరిగిన రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సూర్య మాట్లాడుతూ తన నెక్ట్స్ మూవీ వెంకీ అట్లూరితో ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ మే నుండి ప్రారంభమవుతుందని సూర్య కూడా ప్రకటించారు. ఈ చిత్రాన్ని నిర్మాత సితార ఎంటర్టైన్మెంట్స్ వంశీ నిర్మిస్తారని నటుడు సూర్య కూడా ప్రకటన సందర్భంగా పేర్కొన్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తుంది.
లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో సూర్య సరసన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఇప్పటివరకు తెలుగులో సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. కొన్ని రోజులుగా హిందీలో అవకాశాలు అందుకుంటున్న మృణాల్.. ఇప్పుడు ఈ మూవీతో తమిళంలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?
Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..
