ఆగస్టులో థియేటర్స్ దద్దరిలిపోవాల్సిందే.. బడా హీరోల సినిమాలన్నీ ఒకేసారి
బడా స్టార్స్ అందరూ ఆగస్టు నేలను టార్గెట్ గా పెట్టుకుంటున్నారు. ఇంతకు ఆగస్టు నెలలో విడుదలయ్యే సినిమాలో ఏంటో తెలుసా..
కరోనా కారణంగా వచ్చిన గ్యాప్ ను ఫిల్ చేయడానికి మన హీరోలందరూ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఒకొక్క హీరో మినిమం 2,3 సినిమాలను లైనప్ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా 4 సినిమాలవరకు ఓకే చేస్తున్నారు. ఇక ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేస్తోన్న బడా స్టార్స్ అందరూ ఆగస్టు నేలను టార్గెట్ గా పెట్టుకుంటున్నారు. ఇంతకు ఆగస్టు నెలలో విడుదలయ్యే సినిమాలో ఏంటో తెలుసా.. అందరి కంటే ముందు ఆగస్టు నేలను ఫిక్స్ చేసుకున్నారు దర్శకుడు త్రివిక్రమ్. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. ఈ సినిమా షూటింగ్ పలుసార్లు వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. ఈ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేయనున్నామని నిర్మాతలు ఇప్పటికే అనౌన్స్ చేశారు.
మహేష్ తో పాటు అదే నెలలో రానున్నారు మరో సూపర్ స్టార్. ఆయనే తలైవా రజినీకాంత్. ఆయన నటిస్తోన్న లేటెస్ట్ మూవీ జైలర్, పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతోన్న ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాను కూడా ఆగస్టు నెలలో విడుదల చేయనున్నారు. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
ఇక మాస్ మహారాజ రవితేజ నటిస్తోన్న టైగర్ నాగేశ్వరరావు అనే పాన్ ఇండియా మూవీని కూడా ఆగస్టులోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా వస్తోన్న యానిమల్ సినిమాకూడా ఆగస్టులోనే రిలీజ్ అయ్యే ఛాన్స్ లు ఉన్నాయి. యానిమల్ ఆగస్టు 11 రిలీజ్ కన్ఫర్మ్ అయింది.