Ram Charan-Shankar: చరణ్- శంకర్ సినిమాలో కీలక పాత్రలో మలయాళ స్టార్ హీరో..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్ లో వచ్చే సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మెగా ఫ్యాన్స్.

Ram Charan-Shankar: చరణ్- శంకర్ సినిమాలో కీలక పాత్రలో మలయాళ స్టార్ హీరో..
Ram Charan Shankar
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 19, 2022 | 9:21 AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)- శంకర్ కాంబినేషన్ లో వచ్చే సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మెగా ఫ్యాన్స్.  ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న చరణ్ ఇప్పుడు శంకర్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. పొలిటికల్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు శంకర్. ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇందులో చరణ్ పవర్ ఫుల్ రాజకీయ నాయుకుడిగా కనిపించనున్నాడని ఇప్పటికే ఫిల్మ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. గతంలోనూ ఈ మూవీ నుంచి చెర్రీ ఫోటోస్ , వీడియోస్ నెట్టింట లీకైన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం మలయాళ స్టార్ నటించనున్నారని తెలుస్తోంది. స్టార్ నటుడు మోహన్ లాల్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమా సెకండాఫ్ లో ఆయన పాత్ర ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు. శంకర్ డిఫరెంట్ గా.. పవర్ఫుల్ గా డిజైన్ చేసిన ఈ పాత్ర కోసం మోహన్ లాల్ కి భారీ పారితోషికమే ముట్టిందని చెబుతున్నారు.. ఇక ఈ సినిమా రైట్స్ ను ఓవర్సీస్ లో ఏకంగా 5 మిలియన్ డాలర్లకు ప్రముఖ సంస్థ కొనుగోలు చేసినట్టు టాక్ వినిపిస్తోంది. ఓవర్సీస్‌లో చరణ్ శంకర్ మూవీకి ఇంత క్రేజా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. బీటౌన్ నటి హుమా ఖురేషి ఈ ప్రాజెక్టులో కీలకపాత్రలో నటించనుందట. ఉత్తరాది రాజకీయ నాయకురాలిగా నటిస్తోందని..ఇందులో ఆమె పాత్ర ఎంతో పవర్ఫుల్ గా ఉండనుందని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో సునీల్, శ్రీకాంత్, అంజలి, ఎస్ జే సూర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.