AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MM Keeravani: ‘మరణ భయంతో రెండు నెలలు నిద్రలేని రాత్రులు’.. ఎమ్ ఎమ్ కీరవాణి ఆసక్తికర ట్వీట్..

ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా కీరవాణి పేరు మారుమోగింది. ఈ చిత్రానికి ఆయన అందించిన మ్యూజిక్ శ్రోతలను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆయన అందించిన మాస్ మ్యూజిక్‏కు ప్రపంచమంతా స్టెప్పులేసింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ వేదికపై కీరవాణి అందించిన మాస్ బీట్‏కు హాలీవుడ్ యాక్టర్స్ సైతం కాలు కదిపారు. ఆస్కార్ అవార్డుతోపాటు ఎన్నో అవార్డులను అందుకున్నారు.

MM Keeravani: 'మరణ భయంతో రెండు నెలలు నిద్రలేని రాత్రులు'.. ఎమ్ ఎమ్ కీరవాణి ఆసక్తికర ట్వీట్..
Keeravani
Rajitha Chanti
|

Updated on: Jul 24, 2023 | 8:24 AM

Share

ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా కీరవాణి పేరు మారుమోగింది. ఈ చిత్రానికి ఆయన అందించిన మ్యూజిక్ శ్రోతలను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆయన అందించిన మాస్ మ్యూజిక్‏కు ప్రపంచమంతా స్టెప్పులేసింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ వేదికపై కీరవాణి అందించిన మాస్ బీట్‏కు హాలీవుడ్ యాక్టర్స్ సైతం కాలు కదిపారు. ఆస్కార్ అవార్డుతోపాటు ఎన్నో అవార్డులను అందుకున్నారు. ప్రస్తుతం కీరవాణి హరి హర వీరమల్లు, చంద్రముఖి 2 సినిమాలకు సంగీతం అందిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు కొద్ది రోజులుగా వేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇటీవలే చంద్రముఖి 2 షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇందులో రాఘవ లారెన్స్, బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈసినిమా అడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలోనే చంద్రముఖి 2లోని యాక్షన్ సీన్స్.. అందులోని పాత్రలకు సంగీతంతో ప్రాణం పోసేందుకు తాను రెండు నెలలు నిద్రలేని రాత్రులు గడిపానంటూ ట్వీట్ చేశారు కీరవాణి.

“చంద్రముఖి 2 చిత్రంలోని పాత్రలు మరణ భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతాయి. అలాగే ఇందులోని మనసుకు హత్తుకునే సన్నివేశాలకు నా సంగీతంతో ప్రాణం పోసేందుకు రెండు నెలలు నిద్రలేని రాత్రలు, పగళ్లు గడిపాను. గురుకిరణ్, మిత్రుడు విద్యాసాగర్.. నాకు జయం కలగాలని కోరుకోండి” అంటూ ట్వీట్ చేశారు కీరవాణి. ప్రస్తుతం ఆయన ట్వీట్ నెట్టింట వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి

2005లో సూపర్ స్టార్ రజినీకాంత్, నయనతార జంటగా నటించిన చంద్రముఖి సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పి.వాసు దర్శకత్వం వహించారు. తమిళంతోపాటు.. తెలుగులోనూ విడుదలైన ఈ సినిమాకు భారీ విజయాన్ని అందుకుంది. ఇక మళ్లీ ఇన్నాళ్లకు చంద్రముఖి 2 అడియన్స్ ముందుకు వస్తోంది. ఇందులో రాధికా శరత్ కుమార్, లక్ష్మీ మీనన్, వడివేలు కీలకపాత్రలు పోషించగా.. సెప్టెంబర్ 19న రిలీజ్ చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్