Unstoppable with NBK : బాలయ్య టాక్ షో నెక్స్ట్ గెస్ట్ ఆమేనా.. ? చక్కర్లు కొడుతున్న వార్త..

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే అఖండ సినిమా షూటింగ్ ను పూర్తిచేసిన బాలయ్య.

Unstoppable with NBK : బాలయ్య టాక్ షో నెక్స్ట్ గెస్ట్ ఆమేనా.. ? చక్కర్లు కొడుతున్న వార్త..
Balakrishna
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 21, 2021 | 9:11 AM

NBK: నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే అఖండ సినిమా షూటింగ్ ను పూర్తిచేసిన బాలయ్య. ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇక అఖండ సినిమా కోసం బాలయ్య అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య రెండు డిఫరెంట్ పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా తర్వాత బాలయ్య క్రాక్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఇటీవలే పూజ కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక సినిమాలతో పాటు ఓటీటీలోను బాలయ్య తన సత్తా చాటుతున్నారు. 100 శాతం తెలుగు కంటెంట్ తో డెస్కుకు పోతున్న ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా తో కలిసి నటసింహం ఓ టాక్ షో చేస్తున్న విషయం తెలిసిందే.

మొదటి సారి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న ఈ టాక్ షో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. మొదటి ఎపిసోడ్ కు కలక్షన్ కింగ్ మోహన్ బాబు గెస్ట్ గా హరజరయ్యారు. బాలయ్య – మోహన్ బాబు మధ్య జరిగిన సరదా సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆతర్వాత నేచురల్ స్టార్ నాని ఈ టాక్ షోకు హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు అన్ స్టాపబుల్ మూడో ఎపిసోడ్ కు రెడీ అవుతుంది. ఇటీవల బాలయ్య భుజానికి సర్జరీ అయ్యింది దాంతో ఆయన చిన్న బ్రేక్ తీసుకున్నారు. త్వరలోనే పూర్తిగా కోలుకొని తిరిగి షూటింగ్స్ కు హాజరు కానున్నారు. అయితే బాలయ్య అన్ స్టాపబుల్ షోకు రోజా గెస్ట్ గా రానున్నారని టాక్ వినిపిస్తుంది. ఇటీవల రోజా  పుట్టిన రోజున ఆమెకు గ్రీటింగ్స్ చెప్పిన బాలయ్య.. ఈ షో గురించి ప్రస్తావించగా తాను వస్తానని రోజా చెప్పారట. త్వరలోనే ఆమెతో టాక్ షో ఉండొచ్చని అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఇక రాజకీయాల్లో ఇద్దరి దారులు వేరైనా.. బయట మాత్రం చాలా సన్నిహితంగా ఉంటారు.

Roja

 మరిన్ని ఇక్కడ చదవండి : 

Hyderabad: ఇకపై థియేటర్లలో పార్కింగ్‌ ఫీజు చెల్లించాల్సిందే.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం..

ఇండియాలో మొట్టమొదటి ‘లేడీ సూపర్ హీరో’ చిత్రం.. 3డిలో అదరగొట్టనున్న మాజీ మిస్‌ ఇండియా..

Varshini Sounderajan: తన ఒంపుసొంపులతో ఫిదా చేస్తున్న వర్షిణి లేటెస్ట్ పిక్స్

ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!