Radhe Shyam: ఆ పాట వింటే ‘రాధే శ్యామ్‌’ కథేంటో తెలిసి పోతుంది.. ఆసక్తికర విషయాలు పంచుకున్న..

Radhe Shyam: ప్రభాస్‌ ఫ్యాన్స్‌, ఆ మాటకొస్తే యావత్ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ ప్రభాస్‌ 'రాధేశ్యామ్‌' సినిమా కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై విపరీతంగా అంచనాలు ఏర్పడ్డాయి..

Radhe Shyam: ఆ పాట వింటే 'రాధే శ్యామ్‌' కథేంటో తెలిసి పోతుంది.. ఆసక్తికర విషయాలు పంచుకున్న..
Radheshyam Song
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 21, 2021 | 8:59 AM

Radhe Shyam: ప్రభాస్‌ ఫ్యాన్స్‌, ఆ మాటకొస్తే యావత్ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై విపరీతంగా అంచనాలు ఏర్పడ్డాయి. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను యూరప్‌ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇక రాధేశ్యామ్‌ చిత్రానికి సంబంధించి ఇటీవల విడదులైన టీజర్‌, తొలి లిరికల్‌ సాంగ్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ముఖ్యంగా ‘ఈ రాతలే’ పాట సినిమాపై క్యూరియాసిటీ పెంచేసింది.

అర్థమవంతమైన లిరిక్స్‌తో కూడిన ఈ పాట సినిమాకే హైలెట్‌గా నిలిచేలా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ పాటకు సంబంధించిన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కృష్ణకాంత్‌. ఈ రాతలే పాటకు కృష్ణకాంత్‌ రచయితగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా శనివారం మీడియాతో మాట్లాడిన కృష్ణకాంత్‌ ఈ పాటకు సంబంధించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాధే శ్యామ్‌ చిత్రాన్ని కొంత మంది పునర్జన్మల కథని, ఇంకొంత మంది టైమ్‌ ట్రావెల్‌ అని, ట్రైన్‌లో జరిగే సినిమా అని ఏవేవో ఊహించుకుంటున్నారు.

Radheshyam

 

ఈ కథ ఏంటనేది వారి ఊహలకే వదిలేస్తున్నాను. ఇక నేను రాసిన ‘ఈ రాతలే’.. పాట వింటుంటే అందరికీ అర్థం కాదు. కాస్త సంక్లిష్టంగా అనిపిస్తుంటుంది. విజువల్‌గా చూస్తే ఎందుకిలా రాశామో అర్థమవుతుంది. నిజానికి ఈ పాటలోనే చిత్ర కథ ఉంటుంది’ అని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే కృష్ణకాంత్‌ ప్రస్తుతం ‘శ్యామ్‌ సింగరాయ్‌’తో పాటు ‘ది ఘోస్ట్‌’, ‘మేజర్‌’, ‘హిట్‌ 2’ సినిమాలకు పాటలను అందిస్తున్నారు.

Also Read: Young Tiger NTR: విహార యాత్రలో యంగ్‌ టైగర్‌.. భార్య పిల్లలతో కలిసి ఇలా.. స్టైలిష్‌ లుక్‌లో ఎన్టీఆర్‌..

Hyderabad: ఇకపై థియేటర్లలో పార్కింగ్‌ ఫీజు చెల్లించాల్సిందే.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం..

Richest Dog: వేల కోట్ల ఆస్తికి వారసురాలు ఈ కుక్క.. దశాబ్దాలుగా ఈ శునకాలు వారసత్వంగా వేల కోట్ల ఆస్తి