AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vasanthi Krishnan: “క్యాలీఫ్లవర్” టైటిల్ సంపూర్ణేష్ బాబు కరెక్ట్‌గా సూటైంది.. హీరోయిన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

హృదయ కాలేయం’ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యారు. బర్నింగ్‌ స్టార్ సంపూర్ణేష్‌బాబు ప్రస్తుతం ‘క్యాలీ ఫ్లవర్‌’ అనే స‌రికొత్త టైటిల్‌తో మ‌న‌ముందుకు రానున్నారు.

Vasanthi Krishnan: క్యాలీఫ్లవర్ టైటిల్ సంపూర్ణేష్ బాబు కరెక్ట్‌గా సూటైంది.. హీరోయిన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్
Vasanthi
Rajeev Rayala
|

Updated on: Nov 21, 2021 | 8:59 AM

Share

Cauliflower: హృదయ కాలేయం’ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యారు. బర్నింగ్‌ స్టార్ సంపూర్ణేష్‌బాబు ప్రస్తుతం ‘క్యాలీ ఫ్లవర్‌’ అనే స‌రికొత్త టైటిల్‌తో మ‌న‌ముందుకు రానున్నారు. ‘శీలో రక్షతి రక్షిత:’ అనేది ఉపశీర్షిక. గుడూరు శ్రీధర్‌ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్‌ పతాకాలపై ఆశా జ్యోతి గోగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్కే మలినేని ఈ సినిమాకు దర్శకులు. . ఈ చిత్రాన్ని నవంబరు 26న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.  ఈసందర్భంగా  హీరోయిన్ వాసంతి మాట్లాడుతూ.. నేను తెలుగమ్మాయిని. కానీ బెంగళూరులో పెరిగాను. నాకు తెలుగులో ఇదే మొదటి సినిమా. ఐదేళ్ల క్రితమే ఈ రంగంలోకి వచ్చాను. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చాను. కన్నడలో ఐదు సినిమాలు చేశాను. తెలుగులో ఇది నా మొదటి చిత్రం అని చెప్పుకొచ్చింది.

ఇక సంపూర్ణేష్ బాబుతో కలిసి నటించడం పై ఆమె మాట్లాడుతూ.. సంపూ పాత్రలో రెండు వేరియేషన్‌లుంటాయి. క్యాలీఫ్లవర్ కారెక్టర్‌కు మరదలు పాత్ర నాది. ఆయన వెంట పడుతూనే ఉంటాను. కానీ ఆయన నన్ను పట్టించుకోరు. అలాంటి పాత్రను పోషించాను. క్యాలీఫ్లవర్ అనే టైటిల్ ఎందుకు పెట్టారో దర్శకుడినే అడగాలి. కానీ ఇది చాలా యూనిక్‌గా ఉంటుంది. ఓ వెజిటబుల్ పేరు పెట్టారేంటి? అని అనుకున్నాను. సంపూ గారికి ఈ టైటిల్ సెట్ అవుతుంది. పోస్టర్ రిలీజ్ చేశాక షాక్ అయ్యాను అని అంది. నేను ఇంకా సినిమా చూడలేదు. మా యూనిట్‌లో సినిమా చూసిన వారు నేను బాగానే చేశాను అని అంటున్నారు. మరి ఆడియన్స్ రియాక్షన్ చూడాలి. ఇప్పుడు రెండు ప్రాజెక్ట్‌లు చేస్తున్నారు. మారుతి దర్శకత్వంలో ఓ సినిమాను, ఆది సాయికుమార్ చిత్రంలోనూ నటిస్తున్నాను అని చెప్పుకొచ్చింది. అలాగే నేచురల్ స్టార్ నాని అంటే ఇష్టమని ఆయనతో సినిమా చేయాలనీ ఉంది.. ఎప్పటికైనా సినిమా చేస్తా అంటుంది వాసంతి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Hyderabad: ఇకపై థియేటర్లలో పార్కింగ్‌ ఫీజు చెల్లించాల్సిందే.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం..

ఇండియాలో మొట్టమొదటి ‘లేడీ సూపర్ హీరో’ చిత్రం.. 3డిలో అదరగొట్టనున్న మాజీ మిస్‌ ఇండియా..

Varshini Sounderajan: తన ఒంపుసొంపులతో ఫిదా చేస్తున్న వర్షిణి లేటెస్ట్ పిక్స్