Mahasamudram: ‘మహాసముద్రం’ మూవీనుంచి అందమైన మెలోడీ.. ఆకట్టుకుంటున్న పాట

ఆర్ఎక్స్100 సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అజయ్ భూపతి ఇప్పుడు మహాసముద్రం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Mahasamudram: 'మహాసముద్రం' మూవీనుంచి అందమైన మెలోడీ.. ఆకట్టుకుంటున్న పాట
Mahasamudram
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 06, 2021 | 12:55 PM

Mahasamudram: ఆర్ఎక్స్100 సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అజయ్ భూపతి ఇప్పుడు మహాసముద్రం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని తన ఖాతలో వేసుకున్న అజయ్ ఇప్పుడు మరో అదిరిపోయే కథతో సిద్దమయ్యాడు. ఈ సినిమాలో యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్నాడు. శర్వాతోపాటు బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్ కూడా నటిస్తున్నాడు. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అలాగే ఈ  సినిమాలో హీరోయిన్స్‌గా  అదితీరావు .. అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. అలాగే ఈ సినిమా జగపతిబాబు ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా, అక్టోబర్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా హే రంభ హే రంభ అనే పాట యువతను ఆకట్టుకుంటుంది. ఇక ఇప్పడు ఈ సినిమా నుంచి మరో అందమైన మెలోడీ విడుదల చేశారు చిత్రయూనిట్.

ఈ అందమైన మెలోడీని లక్కీ బ్యూటీ రష్మిక మందన చేతులమీదుగా విడుదల చేశారు. “చెప్పకే చెప్పకే ఊసుపోని మాటలు .. ” అంటూ  సాగే ఈపాట ఆకట్టుకుంటుంది. తేలికైన పదాలతో చైతన్యప్రసాద్ అందించిన సాహిత్యం బాగుంది. ఇక ఈ పాటను చైతన్ భరద్వాజ్ సంగీత సారథ్యంలో  దీప్తి పార్థసారథి ఆలపించారు. ఆర్ ఎక్స్ 100 సినిమాతర్వాత  అజయ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమా పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా  ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Jr. NTR: తారక్ అన్ని కార్లపై 9 నంబర్లే ఉండటానికి గల కారణం తెలుసా..

Bigg Boss 5 telugu: వెండితెరపై మెరిసిన ముద్దుగుమ్మ.. ఈ గేమ్ షోలో ఆకట్టుకోగలదా ?..

Ajith: సరిహద్దులు దాటిన ప్రేమ.. స్టార్ హీరో‏పై వీరాభిమానం.. బహుమతులను చూస్తే షాకవ్వాల్సిందే..