Godfather Box Office Day 3: అట్లుంటది మరి మెగాస్టార్ మేనియా అంటే.. రూ. 100 కోట్ల దిశగా గాడ్ ఫాదర్ కలెక్షన్స్..
విడుదలైన రెండు రోజుల్లోనే రూ. 50 కోట్లు మార్క్ చేరిన గాడ్ ఫాదర్.. ఇక వీకెండ్లో రూ. 100 కోట్ల దిశగా కొనసాగుతుంది. ముందస్తు అంచనాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో 3వ రోజు దాదాపు రూ. 10 కోట్లు రాబట్టే అవకాశం ఉంది.
బాక్సాఫీస్ వద్ద గాడ్ ఫాదర్ మేనియా కొనసాగుతుంది. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. మలయాళీ సూపర్ హిట్ లూసీఫర్ చిత్రాన్ని రీమేక్ చేసినా.. తెలుగు ఆడియన్స్‌కు అయ్యేలా మార్పులు చేసి.. అక్టోబర్ 5న దసరా కానుకగా థియేటర్లలోకి తీసుకువచ్చారు మేకర్స్. పొలిటికల్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్ కీలకపాత్రలలో నటించారు. విడుదలైన రెండు రోజుల్లోనే రూ. 50 కోట్లు మార్క్ చేరిన గాడ్ ఫాదర్.. ఇక వీకెండ్లో రూ. 100 కోట్ల దిశగా కొనసాగుతుంది. ముందస్తు అంచనాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో 3వ రోజు దాదాపు రూ. 10 కోట్లు రాబట్టే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రెండు రోజుల్లోనే రూ. 69.12 కోట్లు వసూలు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా 3వ రోజు రూ. 7కోట్లు రాబట్టింది. ఇక వారాంతంలో ఈ మూవీ రూ. 100 కోట్ల మార్క్ చేరే అవకాశం ఉంది. ఆచార్య డిజాస్టర్ తర్వాత చిరు నటించిన ఈ సినిమాకు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ నెట్టింట రచ్చ చేస్తున్నారు మెగా అభిమానులు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో చిరు, సల్మాన్ వచ్చే స్క్రీన్ అదిరిపోయిందంటున్నారు. ఇందులో మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సైతం కీలకపాత్రలో కనిపించారు.
ఈ సినిమానే కాకుండా ప్రస్తుతం చిరు భోళా శంకర్, వాల్తేరు వీరయ్య చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.