AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: మాస్ క్యారెక్టర్‏లో మజా చేయనున్న మహేష్.. కెరీర్ లోనే తొలిసారి పూర్తి డిఫ్రంట్ రోల్‏లో…

ఈ మూవీ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు నెట్టింట రోజుకో వార్త చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఫిల్మ్ సర్కిల్లో ఈ సినిమా నుంచి మహేష్ క్యారెక్టర్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది.

Mahesh Babu: మాస్ క్యారెక్టర్‏లో మజా చేయనున్న మహేష్.. కెరీర్ లోనే తొలిసారి పూర్తి డిఫ్రంట్ రోల్‏లో...
Mahesh Babu
Rajitha Chanti
|

Updated on: Oct 08, 2022 | 10:17 AM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ.. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. అయితే మహేష్ తల్లి ఇందిరా దేవి అకాల మరణంతో మరికొద్ది రోజులు ఈ ప్రాజెక్ట్ రెగ్యూలర్ షూటింగ్ వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. ముందునుంచి త్రివిక్రమ్, మహేష్ కాంబోలో రాబోతున్న ఈ ఎస్ఎస్ఎంబీ 28 ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు నెట్టింట రోజుకో వార్త చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఫిల్మ్ సర్కిల్లో ఈ సినిమా నుంచి మహేష్ క్యారెక్టర్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది.

ఈ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ ఎంతో పవర్ ఫుల్ గా ఉంటుందని.. ఇంతవరకు తన కెరీర్‏లో ఎప్పుడూ కనిపించని డిఫరెంట్ రోల్ ఇందులో చేస్తున్నాడని తెలుస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు డైరెక్టర్ త్రివిక్రమ్ మహేష్ క్యారెక్టర్ డిజైన్ చేశాడని సమాచారం. ఈ సినిమాను హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తుండగా.. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి ఎస్ఎస్. థమన్ సంగీతం అంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ అక్టోబర్ 10 నుంచి స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ మూవీ సమ్మర్ కానుకగా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా తర్వాత మహేష్.. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నాడు. వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా ఇప్పటివరకు తాను చేసిన చిత్రాలన్నింటికంటే పెద్దదిగా ఉంటుందని జక్కన్న ఇదివరకే చెప్పారు. అలాగే ఆఫ్రికన్ అడువుల నేపథ్యంలో ఉండబోతుందని చెప్పుకొచ్చారు రచయిత విజయేంద్ర ప్రసాద్.

Follow Us
ధర్మాజీపేటలో వరుస ఆలయ దొంగతనాలు.. హుండీలు, ఆభరణాలు మాయం!
ధర్మాజీపేటలో వరుస ఆలయ దొంగతనాలు.. హుండీలు, ఆభరణాలు మాయం!
కొత్త కారు కొనాలనుకుంటే ఇదే బెస్ట్‌ ఆప్షన్‌!
కొత్త కారు కొనాలనుకుంటే ఇదే బెస్ట్‌ ఆప్షన్‌!
మాజీ ఆర్మీ జవాన్.. తాగుడు అతడ్ని ఇంతలా దిగజార్చింది..
మాజీ ఆర్మీ జవాన్.. తాగుడు అతడ్ని ఇంతలా దిగజార్చింది..
అందుకే జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడారు..మల్లు రవి కీలక వ్యాఖ్యలు
అందుకే జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడారు..మల్లు రవి కీలక వ్యాఖ్యలు
టేస్ట్.. డబుల్ ఎనర్జీ.. ఎవ్వరికీ తెలియని రాగి లడ్డు రెసిపీ ఇదే..
టేస్ట్.. డబుల్ ఎనర్జీ.. ఎవ్వరికీ తెలియని రాగి లడ్డు రెసిపీ ఇదే..
పిల్లలకు ఇస్తున్న క్రీమ్ బిస్కెట్లలో అసలు క్రీమ్ ఉందా?
పిల్లలకు ఇస్తున్న క్రీమ్ బిస్కెట్లలో అసలు క్రీమ్ ఉందా?
రంగు పోయిన రోల్డ్ గోల్డ్ నగలకు ఇంట్లోనే మెరుగు
రంగు పోయిన రోల్డ్ గోల్డ్ నగలకు ఇంట్లోనే మెరుగు
ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే బల్లులకు చుక్కలే.. ఇలా చేస్తే ఒక్కటి కూడా
ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే బల్లులకు చుక్కలే.. ఇలా చేస్తే ఒక్కటి కూడా
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం సూపర్ న్యూస్.. దేశంలో ఎక్కడైనా..
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం సూపర్ న్యూస్.. దేశంలో ఎక్కడైనా..
ఐపీఎల్ లో వైభవ్ సూర్యవంశీ సంచలన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్
ఐపీఎల్ లో వైభవ్ సూర్యవంశీ సంచలన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్