Chiranjeevi: పుట్టిన రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెగాస్టార్ చిరంజీవి.. వీడియో ఇదిగో
మెగాస్టార్ చిరంజీవి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా భార్యా పిల్లలతో కలిసి తిరుమలకు వచ్చిన మెగాస్టార్ శ్రీవారి గురువారం (ఆగస్టు 22) ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్నారు. శ్రీవారి దర్శనం కోసం ప్రత్యేక విమానంలో బుధవారం (ఆగస్టు 21)రాత్రి తిరుపతి ఎయిర్ పోర్ట్ చేరుకున్న చిరంజీవి కుటుంబం రాత్రి తిరుమలలో బస చేసింది
మెగాస్టార్ చిరంజీవి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా భార్యా పిల్లలతో కలిసి తిరుమలకు వచ్చిన మెగాస్టార్ శ్రీవారి గురువారం (ఆగస్టు 22) ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్నారు. శ్రీవారి దర్శనం కోసం ప్రత్యేక విమానంలో బుధవారం (ఆగస్టు 21)రాత్రి తిరుపతి ఎయిర్ పోర్ట్ చేరుకున్న చిరంజీవి కుటుంబం రాత్రి తిరుమలలో బస చేసింది. చిరంజీవితో పాటు సతీమణి సురేఖ, తల్లి అంజనాదేవి, శ్రీజ కుమార్తెలు తిరుమలకు వచ్చారు. పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి గురువారం (ఆగస్టు 22) ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్న చిరంజీవి కి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. చిరంజీవి తోపాటు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో చిరంజీవి దంపతులకు వేద పండితుల ఆశీర్వచనం అందచేశారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని ఆలయ అధికారులు అందజేశారు. ఆలయం లోపల, వెలుపల చిరంజీవిని చూసేందుకు భక్తులు, అభిమానులు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. అనంతరం చిరంజీవి తిరుమల లో బస చేసిన అతిథి గృహం నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అయ్యారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.