AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: అవమానాలను స్వీకరించి స్వయంకృషితో ఎదిగిన మెగాస్టార్.. చిరంజీవి సినీ ప్రయాణం..

Megastar Chiranjeevi Birthday: ఎంతో మందికి స్పూర్తి మెగాస్టార్ చిరంజీవి. తెలుగు ప్రజలకు అన్నయ్యగా మారిన చిరు అభిమానుల కోసం ఎప్పుడూ ముందుంటారు. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేసే ఆపద్భాంధవుడు. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. అంటే ఈరోజు సినీ ప్రియులకు, మెగా అభిమానులకు పండగ రోజు.

Megastar Chiranjeevi: అవమానాలను స్వీకరించి స్వయంకృషితో ఎదిగిన మెగాస్టార్.. చిరంజీవి సినీ ప్రయాణం..
Megastar Chiranjeevi
Rajitha Chanti
|

Updated on: Aug 22, 2024 | 7:16 AM

Share

మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. సినీ నేపథ్యం లేకుండా సాధారణ మధ్య తరగతి ఫ్యామిలీ నుంచి తెలుగు చలన చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి తెలుగు సినిమా గతి మార్చిన హీరో. నటుడిగా సినీరంగంలో గుర్తింపు తెచ్చుకోవాలనే ఆరాటం అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. కెరీర్ తొలినాళ్లలో అనేక అవమానాలు, విమర్శలు ఎదుర్కొని ఇప్పుడు మెగాస్టార్ అయ్యాడు. దశాబ్దాలుగా చిత్రసీమను ఏలుతున్న రారాజు. ఎంతో మందికి స్పూర్తి మెగాస్టార్ చిరంజీవి. తెలుగు ప్రజలకు అన్నయ్యగా మారిన చిరు అభిమానుల కోసం ఎప్పుడూ ముందుంటారు. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేసే ఆపద్భాంధవుడు. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. అంటే ఈరోజు సినీ ప్రియులకు, మెగా అభిమానులకు పండగ రోజు. చిరు పుట్టినరోజుకు వారం రోజుల ముందు నుంచే మెగా అభిమానులు సెలబ్రేషన్స్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు సోషల్ మీడియాలో అన్నయ్య బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.

ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు వంటి అగ్రకథానాయకులు సినీ ఇండస్ట్రీని ఏలుతున్న సమయంలో నిలదొక్కుకుని హీరోగా సినీరంగంలో ఎగిసిపడ్డ కెరటం చిరంజీవి. తెలుగు సినిమా పరిశ్రమ రూపురేఖలను మార్చేశారు. అంతేకాదు.. టాలీవుడ్ ఇండస్ట్రీకి బ్రేక్ డ్యాన్స్ పరిచయం చేసిన హీరో. డైలాగ్స్, చిరు మ్యానరిజం, పాటలు, డ్యాన్సులకు అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. 1978లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరు.. ఎన్నో సవాళ్లను, విమర్శలను, అవమానాలను ఎదుర్కొన్నారు. కానీ ఎప్పుడూ వెనకడుగు వేయకుండా ఆత్మవిశ్వాసంతో నటనపై ఇష్టంతో అవకాశాల కోసం ప్రయత్నించారు. కెరీర్ తొలి నాళ్లల్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. ఆ తర్వాత విలన్ పాత్రలలోనూ అలరించారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత పునాది రాళ్లు సినిమాలో హీరోగా అవకాశం అందుకున్నారు. కానీ ప్రాణం ఖరీదు మూవీ ముందుగా విడుదలైంది. ఈ మూవీతోనే తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమయ్యారు చిరు. మొదటి సినిమాతోనే నటుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. హీరోగా మారిన తర్వాత కూడా చిరుకు స్టార్ హీరోల సినిమాల్లో చిన్న చిన్న పాత్రల అవకాశాలు వచ్చాయి. కానీ చిరు ఒప్పుకోలేదు.

అవమానాలు ఎదుర్కొని..

ఇవి కూడా చదవండి

చిరంజీవి ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు హరిప్రసాద్, సుధాకర్ తో మద్రాసులో ఉండేవారు. పూర్ణా పిక్చర్స్ సంస్థ మేనేజరు తాము పంపిణీ చేసే సినిమాల ప్రివ్యూలు చూసి, వాటి రివ్యూలు ఇవ్వమని వారికి చెప్పేవారు. అలా ఓ హోదాలో ఓ సినిమా చూడటానికి వెళ్లి ముందు వరుసలో కూర్చున్నారు. ఆ సినిమాలో నటించిన హీరో డ్రైవర్, మేకప్ మెన్ లు రావడం వల్ల చిరంజీవి, హరిప్రసాద్, సుధాకర్ లను లేపి వారిని కూర్చొబెట్టారు. ఆ తర్వాత ఆ సంస్థ అధినేత సతీమణి సినిమా ఎలా ఉందని అడగ్గా.. ఆ హీరో తమను డోర్ దగ్గర నిలబెట్టాడని.. తిరిగి వస్తే మీకు చెడ్డపేరు వస్తుందని భరించామని.. ఎప్పటికైనా ఇండస్ట్రీకి నెంబర్ వన్ హీరోను కాకపోతే అడగండి అని అన్నారట చిరు. ఇక ఇండస్ట్రీలో హీరోగా మారిన తర్వాత డ్యా్న్స్ విషయంలో తన మేనేజర్ అభిప్రాయం అడగ్గా.. వెనక ఉన్న డ్యాన్సర్స్ ఏం చేశారో మీరు అదే చేశారు.. మీ ప్రత్యేకత చూపించాలని అని చెప్పారట. దీంతో అప్పటి నుంచి కొరియోగ్రాఫర్స్ చెప్పినదానికంటే ఎక్కువగానే డ్యాన్స్ చూస్తే ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. చిరు సినీ ప్రయాణంలో ఎన్నో సంచలనాలు.. మరెన్నో రికార్డులు. ప్రస్తుతం చిరు వయసు 68 సంవత్సరాలు. ఇప్పటికీ మెగాస్టార్ నిత్య విద్యార్థి. అగ్రకథానాయకుడిగా దశాబ్దాలుగా ఏలుతున్న చిరు.. ఇప్పటికీ అలసిపోని నిత్య శ్రామికుడు. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.