Kalki 2898 AD OTT: ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.. ‘కల్కి’ని ఎక్కడ చూడొచ్చంటే?

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మైథాలజీ అండ్ ఫిక్షనల్ యాక్షన్ థ్రిల్లర్ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. రికార్డు స్థాయి వసూళ్లు సాధించి ప్రభాస్ కెరీర్ లో మరుపురాని చిత్రంగా నిలిచింది. ఓవరాల్ గా ఈ సినిమాకు రూ.1200కోట్లకు పైగానే వసూళ్లు వచ్చాయి.

Kalki 2898 AD OTT: ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.. 'కల్కి'ని ఎక్కడ చూడొచ్చంటే?
Kalki 2898 AD Movie
Follow us

|

Updated on: Aug 22, 2024 | 7:02 AM

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మైథాలజీ అండ్ ఫిక్షనల్ యాక్షన్ థ్రిల్లర్ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. రికార్డు స్థాయి వసూళ్లు సాధించి ప్రభాస్ కెరీర్ లో మరుపురాని చిత్రంగా నిలిచింది. ఓవరాల్ గా ఈ సినిమాకు రూ.1200కోట్లకు పైగానే వసూళ్లు వచ్చాయి. ఇటీవల ఆగస్టు 15తో కల్కి సినిమా థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. దాదాపు థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ప్రభాస్ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వీరి నిరీక్షణకు తెరపడింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో కల్కి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను సొంతం చేసుకుంది. అయితే హిందీ వెర్షన్ రైట్స్ మాత్రం నెట్ ఫ్లిక్స్ దగ్గర ఉన్నాయి. ఈ క్రమంలో గురువారం (ఆగస్టు 22) అర్ధరాత్రి నుంచే కల్కి సినిమా ఓటీటీలో ప్రత్యక్షమైంది. అమెజాన్ ప్రైమ్ లో తెలుగు,తమిళం, కన్నడ, మలయాళం తదితర వెర్షన్లు స్ట్రీమింగ్ అవుతుండగా, హిందీ, ఇంగ్లిష్ వెర్షన్లు మాత్రం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉన్నాయి. ఆయా ఓటీటీ సంస్థలు తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ విషయాన్ని పంచుకున్నాయి.

కల్కి సినిమాలో బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది. అలాగే బిగ్ బీ అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్, దిశా పటానీ, శోభన, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. రామ్ గోపాల్ వర్మ, బ్రహ్మానందం, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్, మాళవికా నాయర్ తదితరులు స్పెషల్ రోల్స్ లో మెరిశారు. . వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సుమారు రూ. 700 కోట్ల బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కల్కి సినిమాను నిర్మించారు. మరి థియేటర్లలో ప్రభాస్ కల్కి సినిమాను మిస్ అయ్యారా? లేదా మళ్లీ ఇంకోసారి అద్భుతమైన కల్కి ప్రపంచాన్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ లో కల్కి తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్,..

హిందీ వెర్షన్ మాత్రం నెట్ ఫ్లిక్స్ లో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే