Chiranjeevi: ‘నా వైద్యం కోసం 60 లక్షలకు పైగా ఖర్చు చేశారు.. నా జీవితం చిరంజీవి చలవే’: నటుడు పొన్నాంబళం

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనేందుకు ప్రముఖ తమిళ నటుడు, అలనాటి విలన్ పొన్నాంబళం చెన్నై నుంచి హైద‌రాబాద్ వ‌చ్చారు. మెగాస్టార్ బ‌ర్త్‌డే నేప‌థ్యంలో న‌గ‌రంలో ఏర్పాటుచేసిన ఓ కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన చిరంజీవి చేసిన సాయాన్ని మరోసారి గుర్తు తెచ్చుకుని ఎమోషనల్ అయ్యారు. '

Chiranjeevi: 'నా వైద్యం కోసం 60 లక్షలకు పైగా ఖర్చు చేశారు.. నా జీవితం చిరంజీవి చలవే': నటుడు పొన్నాంబళం
Ponnambalam, Chiranjeevi
Follow us
Basha Shek

|

Updated on: Aug 22, 2024 | 7:53 AM

మెగాస్టార్ చిరంజీవి గురువారం (ఆగస్టు 22) తన 69వ పుట్టిన రోజు జరుపుకొంటున్నారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు మెగాస్టార్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక అభిమానులు చిరు బ‌ర్త్‌డే వేడుకల‌ను గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే చాలా చోట్ల రక్తదానం, అన్నదాన శిబిరాలు నిర్వహించారు. ఈ రోజు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు పూర్తి చేస్తున్నారు. కాగా మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనేందుకు ప్రముఖ తమిళ నటుడు, అలనాటి విలన్ పొన్నాంబళం చెన్నై నుంచి హైద‌రాబాద్ వ‌చ్చారు. మెగాస్టార్ బ‌ర్త్‌డే నేప‌థ్యంలో న‌గ‌రంలో ఏర్పాటుచేసిన ఓ కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన చిరంజీవి చేసిన సాయాన్ని మరోసారి గుర్తు తెచ్చుకుని ఎమోషనల్ అయ్యారు. ‘చెన్నై నుంచి ఈరోజు హైదరాబాదులో మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కార్యక్రమానికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇప్పటివరకు 1500 సినిమాలకు ఫైట్స్ చేశాను. చిరంజీవి హీరోగా నటించిన ఘరానా మొగుడు హిట్ అవకపోతే నేను ఇండస్ట్రీని వొదిలేస్తను అని చెప్పాను. 1985- 86 రోజుల్లో మాకు డైలీ సాలరీ 350 రూపాయలు మాత్రమే. చిరంజీవి సినిమా షూటింగ్ ఉన్నప్పుడు మాత్రం ఫైటర్స్ కి ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఇచ్చేవారు. నాకు కిడ్నీ ఫెయిల్ అయ్యింది అని తెలిసి చిరంజీవి నాకు ఇప్పటివరకు నాకు 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈరోజు నేను ఇలా మీ ముందు ఉన్నాను అంటే అది చిరంజీవి చలవ వల్లనే. ఈ జీవితం ఆయన ఇచ్చిందే’ అని పొన్నాంబళం ఎమోషనల్ అయ్యారు.

తెలుగు, తమిళ్ భాషల్లో ఎన్నో హిట్ సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించారు పొన్నాంబళం. అయితే కొన్నేళ్ల క్రితం ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. ఆ సమయంలో తాను నమ్ముకున్నవాళ్లెవరూ సాయం చేయలేదని బాధ పడ్డారు. అయితే ‘నేనున్నానంటూ’ చిరంజీవి తనను ఆపద్బాంధవుడిలా ఆదుకున్నారని ఈ నటుడు గతంలో చెప్పుకొచ్చారు. మెగాస్టార్ వల్లే తాను ప్రాణాలతో ఉన్నానని ఎమోషనల్ అయ్యారు. చిరంజీవి కథానాయకుడిగా నటించిన హిట్లర్,ఘ‌రానా మొగుడు, ముగ్గురు మొన‌గాళ్లు త‌దిత‌ర చిత్రాల్లో పొన్నాంబళం విలన్ గా నటించి మెప్పించారు.

ఇవి కూడా చదవండి

చిరంజీవి గురించి పొన్నాంబళం మాటల్లో.. వీడియోలు ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.