Acharya: ఆచార్య కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్.. సంతోషంలో మెగా ఫ్యాన్స్..
మెగాస్టార్ అభిమానులకు గుడ్ న్యూస్ అందించారు ఆచార్య మేకర్స్.
మెగాస్టార్ అభిమానులకు గుడ్ న్యూస్ అందించారు ఆచార్య మేకర్స్. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఆచార్య సినిమా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా ఏప్రిల్ 1న రిలీజ్ విడుదల చేయనున్నట్లు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ తన ట్వీట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది.
మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం ఆచార్య. ఇందులో చిరు సరసన కాజల్ హీరోయిన్గా నటించగా.. రామ్ చరణ్, పూజా హెగ్డే కీలకపాత్రలలో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తైన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్లుగా గతంలో ప్రకటించారు మేకర్స్. అయితే గత కొద్ది రోజులుగా దేశంలో కరోనా, ఓమిక్రాన్ ప్రభావం సినీ పరిశ్రమపై ప్రభావం చూపిస్తోంది. రోజు రోజూకీ కేసులు గణనీయంగా పెరుగుతున్న క్రమంలో ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిన్న సంక్రాంతి రోజున ఆచార్య సినిమాను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. దీంతో మెగా అభిమానులు నిరాశ చెందారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆచార్య కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. ఈచిత్రాన్ని ఉగాది కానుకగా ఏప్రిల్ 1న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా తెలియజేశారు.
ట్వీట్..
This Ugadi, Witness the MEGA MASS on big screens ??#Acharya Grand Release on April 1 ?#AcharyaOnApril1
Megastar @KChiruTweets @AlwaysRamCharan #Sivakoratala @MsKajalAggarwal @hegdepooja #ManiSharma #NiranjanReddy @MatineeEnt @KonidelaPro pic.twitter.com/DwnYRcakcd
— Konidela Pro Company (@KonidelaPro) January 16, 2022
Also Read: Naga Chaitanya: ఆ విషయంలో నాకు సమంతే బెస్ట్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నాగచైతన్య..
Pushpa Srivalli Dance: శ్రీవల్లి పాటకు స్టెప్పులేసి టీమిండియా క్రికెటర్లు.. అదరగొట్టేశారుగా.!
Anasuya Bharadwaj: అనసూయ తమిళ్ మూవీ నయా పోస్టర్ చూశారా.. ఆకట్టుకుంటోన్న అందాల భామ..