Chiranjeevi: మెగాస్టార్‌ ఇంట వినాయక చవితి సెలబ్రేషన్స్‌.. మనవరాలితో మొదటిసారిగా.. ఫొటోస్‌ చూశారా?

మెగాస్టార్‌ చిరంజీవి ఇంట్లో వినాయక చవితి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ ఏడాది గణేష్‌ చతుర్థి వేడుకలు మెగా ఫ్యామిలీకి మరింత స్పెషల్‌. ఎందుకంటే ఈ ఏడాదే చిరంజీవి మరోసారి తాతగా ప్రమోషన్‌ పొందారు. జూన్‌లో రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. చిరంజీవి ఫ్యామిలీతో పాటు అభిమానులు మెగా వారసురాలి రాకను ఓ పండగలా సెలబ్రేట్ చేసుకున్నారు

Chiranjeevi: మెగాస్టార్‌ ఇంట వినాయక చవితి సెలబ్రేషన్స్‌.. మనవరాలితో మొదటిసారిగా.. ఫొటోస్‌ చూశారా?
Chiranjeevi Family
Follow us

|

Updated on: Sep 18, 2023 | 3:07 PM

దేశవ్యాప్తంగా గణేష్‌ చతుర్థి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఊరూరా, వాడవాడా వినాయకుడి విగ్రహాలను కొలువు దీరాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా తమ ఇళ్లల్లో గణేశుడి ప్రతిష్ఠించి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి ఇంట్లో వినాయక చవితి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ ఏడాది గణేష్‌ చతుర్థి వేడుకలు మెగా ఫ్యామిలీకి మరింత స్పెషల్‌. ఎందుకంటే ఈ ఏడాదే చిరంజీవి మరోసారి తాతగా ప్రమోషన్‌ పొందారు. జూన్‌లో రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. చిరంజీవి ఫ్యామిలీతో పాటు అభిమానులు మెగా వారసురాలి రాకను ఓ పండగలా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆతర్వాత మెగా ప్రిన్సెస్‌కు క్లీంకార కొణిదెలగా నామకరణం చేశారు. ఈక్రమంలో మనవరాలితో కలిసి వినాయక చవితిని గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు చిరంజీవి. ఈ వేడుకల్లో చిరంజీవి సతీమణి సురేఖ, తల్లి అంజనా దేవి, రామ్‌చరణ్‌-ఉపాసన దంపతులు, శ్రీజ, ఆమె పిల్లలు సందడి చేశారు. తమ గణేష్‌ చతుర్థి సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు చిరంజీవి. ‘అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాల్లో విఘ్నాలు తొలగి అందరికీ శుభములు కలగాలని ప్రార్ధిస్తున్నాను. ఈ సారి ప్రత్యేకత … చిన్ని ‘క్లిన్ కారా’ తో కలిసి తొలి వినాయక చవితి జరుపుకోవడం ‘ అని ట్వీట్‌ చేశారు చిరంజీవి. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. మెగా ఫ్యామిలీ అంతా ఒకే చోట చేరడంతో అభిమానులు తెగ ఖుషి అవుతున్నారు. వినాయకచవితి శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులు కూడా తమ ఇన్‌ స్టా గ్రామ్‌ ఖాతాల్లో గణేష్‌ చతుర్థి వేడుకల ఫొటోలను షేర్‌ చేసుకున్నారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే భోళాశంకర్‌ సినిమాతో అభిమానులను పలకరించారు చిరంజీవి. అయితే ఈ మూవీ పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం బింబిసారా డైరెక్టర్‌ వశిష్ఠ మల్లిడి డైరెక్షన్‌లో ఒక సినిమా చేస్తున్నారు. సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అనుష్కా శెట్టి హీరోయిన్‌గా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక రామ్‌ చరణ్‌ ప్రస్తుతం గేమ్‌ ఛేంజర్‌ షూటింగ్‌లో ఉన్నాడు. క్రియేటర్‌ డైరెక్టర్‌ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వినాయక చవితి సంబరాల్లో చిరంజీవి ఫ్యామిలీ..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..