Pelli Sandadi: శ్రీకాంత్ తనయుడి కోసం రంగంలోకి ఆ స్టార్ హీరోలు.. పెళ్లి సందD ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతిథులు ఎవరంటే..
శ్రీకాంత్ తనయుడు హీరోగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న చిత్రం పెళ్లి సందD.

శ్రీకాంత్ తనయుడు హీరోగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న చిత్రం పెళ్లి సందD. ఈ సినిమాకు గౌరీ రోనంకీ దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీలీలా హీరోయిన్గా నటిస్తోంది. రొమాంటిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ పెళ్లి సందD సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకున్నారు. ఈ చిత్రంతో దర్శకేంద్రుడు వెండితెర అరంగేట్రం చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ దసరా కానుగా అక్టోబర్ 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు మేకర్స్.
ఇదిలా ఉంటే.. రాఘవేంద్రుడి సినిమా.., శ్రీకాంత్ తనయుడి కోసం స్టార్ హీరోలు రంగంలోకి దిగుతున్నారు. అక్కినేని నాగార్జున చేతుల మీదుగా టీజర్.. మహేష్ బాబు చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజా మరో ఇద్దరు స్టార్ హీరోస్ దర్శకేంద్రుడికి అండగా ఉంటున్నారు. పెళ్లి సందD ప్రీరిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథులుగా రాబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చిత్రయూనిట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. పెళ్లి సందD ప్రీ రిలీజ్ ఈవెంట్.. రేపు (అక్టోబర్ 10న) సాయంత్రం 6 గంటలకు జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించనున్నారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, రావు రమేష్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, రాజీవ్ కనకాల, హేమ, ప్రగతి కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని కె. కృష్ణమోహన్ రావు సమర్పణలో ఆర్.కె. ఫిలిం అసోసియేట్స్, ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్స్ మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
ట్వీట్..
#PelliSandaD Grand Pre Release Event Tomorrow ?
Chiranjeevi garu & Venkatesh garu are chief guests⚡️
An @mmkeeravaani Musical?#PelliSandaDonOct15#Roshann #SreeLeela @Ragavendraraoba #GowriRonanki @arkamediaworks @Shobu_ @boselyricist @adityamusic @vamsikaka @WallsAndTrends pic.twitter.com/YlLM996ME4
— Arka Mediaworks (@arkamediaworks) October 9, 2021
Also Read: Hero Siddharth: ‘చీటర్స్’ ట్వీట్‌పై హీరో సిద్దార్థ్ క్లారిటీ.. మరోసారి సంచలన వ్యాఖ్యలు