Hero Siddharth: ‘చీటర్స్’ ట్వీట్‌పై హీరో సిద్దార్థ్ క్లారిటీ.. మరోసారి సంచలన వ్యాఖ్యలు

హీరో సిద్దార్థ్ ఇటీవల వేసిన ట్వీట్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.  తెలుగు, తమిళ పరిశ్రమల్లో మంచి పేరున్న హీరో సిద్దార్థ్..

Hero Siddharth: 'చీటర్స్' ట్వీట్‌పై హీరో సిద్దార్థ్ క్లారిటీ.. మరోసారి సంచలన వ్యాఖ్యలు
Hero Siddharth
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 08, 2021 | 6:47 PM

హీరో సిద్దార్థ్ ఇటీవల వేసిన ట్వీట్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.  తెలుగు, తమిళ పరిశ్రమల్లో మంచి పేరున్న సిద్దార్థ్.. సమంత విడాకులు తీసుకున్న రోజునే సంచలన ట్వీట్ వేశాడు. “మోసం చేసేవాళ్లు ఎప్పుడూ బాగుపడరు.. చిన్నప్పుడు నేను స్కూల్లో టీచర్ దగ్గర మొదట నేర్చుకుంది అదే…. మరి మీరేం నేర్చుకున్నారు..? ” అంటూ ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఆయన సమంత గురించే అన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందించారు. కొందరు సిద్దార్థ్‌ను సమర్థించగా.. ఎక్కువమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖ హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా సిద్దార్థ్ వ్యాఖ్యలను సమర్థించడం చర్చనీయాంశమైంది.

తాజాగా తన ట్వీట్‌పై సిద్దార్థ్ రెస్పాండ్ అయ్యారు.  తాను ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని.. తనకు ‘మహాసముద్రం’ దర్శకుడు అజయ్ భూపతికి మాటల మధ్యలో వచ్చిన అంశంపై తన చిన్నప్పుడు నేర్చుకున్న లెసన్‌ని జోడిస్తూ ట్వీట్ చేసినట్లు సిద్దార్థ్ వెల్లడించారు.  ఆ ట్వీట్‌ని పట్టుకుని ప్రపంచంలో మోసం చేసినవాళ్లందరూ.. వారినే అన్నానుకుంటే తానేం చేయలేనని పేర్కొన్నాడు. ‘మా ఇంటి బయట కుక్కలు ఎక్కువవుతున్నాయని అంటే.. ఆ మాటను పట్టుకుని ఎవరో వచ్చి నన్ను కుక్క అంటావా అంటే నేనేం చెయ్యాలి’ అని సిద్దార్థ్ ప్రశ్నించారు. తాను చిన్నప్పటి నుంచి బుక్స్ చదివానని, చాలా నేర్చుకున్నానని.. టీచర్ దగ్గర నేర్చుకున్న విషయమే తాను చెప్పినట్లు సిద్దార్థ్ చెప్పుకొచ్చాడు.

Also Read: ‘కుంగుబాటు నుంచి కోలుకునేందుకు కొంత టైమ్ ఇవ్వండి’.. సమంత భావోద్వేగ లేఖ