Chiranjeevi: మెగాస్టార్ మంచి మనసుకు దండం పెట్టాల్సిందే.. సీనియర్ జర్నలిస్టుకు ఫ్రీగా ఆపరేషన్ చేయించిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనే రియల్ హీరో. అందుకే ఆయనకు అశేష అభిమానులు ఉన్నారు. చిరంజీవి బ్లడ బ్యాంక్, ఐ బ్యాంక్ తో ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారాయన. ఇక కరోనా లాంటి విపత్తుల సమయాల్లో సినీ కార్మికులకు, అభిమానులకు అండగా నిలిచారు. తాజాగా మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు మెగాస్టార్.

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనే రియల్ హీరో. అందుకే ఆయనకు అశేష అభిమానులు ఉన్నారు. చిరంజీవి బ్లడ బ్యాంక్, ఐ బ్యాంక్ తో ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారాయన. ఇక కరోనా లాంటి విపత్తుల సమయాల్లో సినీ కార్మికులకు, అభిమానులకు అండగా నిలిచారు. తాజాగా మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు మెగాస్టార్. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతోన్న ఓ సీనియర్ జర్నలిస్టులకు ఆపన్న హస్తం అందించారు. ఆస్పత్రిలో ఒక్క రూపాయి కట్టనివ్వకుండా అన్నీ తానై చూసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి అభిమానులు మెగాస్టార్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..ప్రముఖ సీనియర్ సినిమా జర్నలిస్ట్ ప్రభు ఇటీవల తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డారు. మెడికల్ టెస్టులు చేయించుకోగా హార్ట్ లో 80 శాతం బ్లాకులు ఉన్నట్లు తేలింది. ఆయన కు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు యాంజియో గ్రామ్ చేసి బైపాస్ చేయాలని సూచించారట. ఈ విషయంలో సెకండ్ ఒపీనియన్ కోసం చిరంజీవిని సంప్రదించారు ప్రభు.
వెంటనే స్పందించిన చిరంజీవి తనకు బాగా పరిచయమున్న స్టార్ హాస్పిటల్ వైద్యులకు ఫోన్ చేసి ప్రభుని అడ్మిట్ చేయించారట. బైపాస్ సర్జరీ చేయాల్సిన పని లేకుండా.. కేవలం స్టంట్స్ వేసి సమస్యను క్లియర్ చేశారట అక్కడి వైద్యులు. ఆస్పత్రిలో ప్రభుని ఒక్క రూపాయి కూడా కట్టనివ్వకుండా అన్ని తానై చూసుకున్నారట మెగాస్టార్. తాజాగా ఆస్పత్రి నుంచి విడుదలైన ప్రభు ఈ విషయాన్ని అందరితో పంచుకున్నారు. తనకు ఎంతో సహాయం చేసిన చిరంజీవికి రుణపడి ఉంటానని కృతజ్ఞతలు తెలుపుతూ ఎమోషనల్ అయ్యారు ప్రభు. ఈ విషయం తెలుసుకున్న జర్నలిస్టులు, సినీ ప్రముఖులు, అభిమానులు మెగాస్టార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇక అభిమానులైతే ‘దటీజ్ మెగాస్టార్.. మా అన్నయ్య మనసు వెన్న’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు.
కష్టం వస్తె గుర్తుకు వచ్చేది మెగా కుటుంబం 🙏🙏
అలాంటి మనుషుల మీద మళ్ళీ చెత్త రాతలు మొదలు పెడతారు ఇప్పటికీ అయిన మారండి తప్పుడు రాతలు ప్రచారాలు మానుకోండి #Chiranjeevi #MegaStar#MegaFamily pic.twitter.com/wYhv6xPYq3
— SANDEEP JSP (@JspSandeep_) May 27, 2024
#Chiranjeevi #MEGASTARCHIRANJEEVI Megastar @KChiruTweets has been awarded the Golden Visa by the UAE (Dubai) government, facilitated by Emirates First!✨#Chiranjeevi #ManOfMassesCHiRANJEEVI @AlwaysRamCharan @upasanakonidela pic.twitter.com/iZARsx626G
— PRAVEENKUMAR GV 👤 (@PraveeGv) May 27, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




